
WTC Final: కోహ్లీని తొలగించాలనుకుంటే అది తప్పే!
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైన నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆ బాధ్యతల నుంచి తొలగించాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాబోదని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్‌స్వాన్ అన్నాడు. టీమ్ఇండియాకు అతడు వెన్నెముకలాంటోడని కొనియాడాడు. తాజాగా కివీస్‌తో జరిగిన తుదిపోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ కోహ్లీని కెప్టెన్‌గా తొలగిస్తే, అది నేరమని భావించాడు. భారత సారథి నిజమైన ఛాంపియన్ అని, అతడో సూపర్‌స్టార్ అని ప్రశంసించాడు. టీమ్‌ఇండియాను బలంగా తీర్చిదిద్దాడని తెలిపాడు. ఆటపై నిబద్ధతతో ఉన్నాడని, వంద శాతం అంకితభావంతో ఉన్నాడని స్వాన్ గుర్తుచేశాడు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీలాంటి మంచి కెప్టెన్ ఉన్నప్పుడు, అతడిని తొలగించాలని నిర్ణయం తీసుకుంటే అదెంత మాత్రం సరైనది కాదు. అది కచ్చితంగా నేరం కిందకే వస్తుంది. భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయం గురించి చూడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు సరిగ్గా సన్నద్ధమవ్వకపోవడం వల్లే టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. తుదిపోరుకు ముందు కోహ్లీసేన సౌథాంప్టన్‌లో ప్రాక్టీస్ మాత్రమే చేసింది. కానీ, ఒక టెస్టుకు సన్నద్ధమవ్వాలంటే అందుకు తగ్గట్టే సరైన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలి. అదే అసలైన సన్నద్ధత. ఈ నేపథ్యంలోనే తుదిపోరులో గెలవడానికి న్యూజిలాండ్ అన్ని అవకాశాలను ముందే తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో అదే కనిపించింది. అలాగే టీమ్‌ఇండియాలోనూ పలువురు బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు’ అని స్వాన్ చెప్పుకొచ్చాడు. కాగా, గతంలో టీమ్‌ఇండియా ఐసీసీ టోర్నీల్లో విఫలమైనప్పుడు కెప్టెన్‌గా కోహ్లీని తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తిన సంగతి గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.