IND vs NZ: అతడితో కలిసి బౌలింగ్‌ చేయడం గొప్ప అనుభూతి: జయంత్‌ యాదవ్‌

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి బౌలింగ్‌ చేయడం గొప్ప అనుభూతి అని యువ ఆటగాడు జయంత్‌ యాదవ్‌ అన్నాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం వల్ల చాలా..

Published : 06 Dec 2021 22:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి బౌలింగ్‌ చేయడం గొప్ప అనుభూతి అని యువ ఆటగాడు జయంత్‌ యాదవ్‌ అన్నాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో జయంత్ యాదవ్‌ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

‘సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌తో కలిసి బౌలింగ్‌ చేయడం మరిచిపోలేని అనుభూతి. జట్టు విజయం గురించి అతడు చాలా ఆలోచిస్తాడు. ఇలాంటి వారితో బంతిని పంచుకుంటే.. అది మన ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మూడోరోజు చివరి సెషన్‌లో వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడిన నేను.. నాలుగో రోజు ఉదయం మెరుగైన ప్రదర్శన చేశాను. పిచ్‌ కూడా పూర్తిగా మారిపోయి స్పిన్‌కు అనుకూలంగా మారింది. వాంఖడే మైదానం నాకు చాలా ప్రత్యేకమైనది. నేను చివరి సారిగా ఇక్కడ ఆడిన టెస్టులో శతకం బాదాను. టీమ్‌ఇండియా సాధించిన ఘన విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని జయంత్‌ యాదవ్‌ అన్నాడు. నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించడంలో జయంత్ యాదవ్‌ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 4/49 తో తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని