Ravi Shastri : మరో ప్రపంచ స్థాయి ఆటగాడు సిద్ధమవుతున్నాడు : రవిశాస్త్రి

దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన యువ ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌పై టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి మరో ప్రపంచ...

Published : 16 Jan 2022 03:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన యువ ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌పై టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి మరో ప్రపంచ స్థాయి ఆటగాడు రాబోతున్నాడని ప్రశంసించాడు. ‘కీగన్‌ పీటర్సన్‌ తన కెరీర్‌ను ఎంతో అద్భుతంగా ప్రారంభించాడు. దక్షిణాఫ్రికా జట్టు నుంచి మరో ప్రపంచ స్థాయి ఆటగాడు సిద్ధమవుతున్నాడు. అతడు బ్యాటింగ్‌ చేసిన తీరు.. దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్‌ను గుర్తు చేసింది’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.

టీమ్‌ఇండియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పీటర్సన్‌ 276 పరుగులు చేసి.. దక్షిణాఫ్రికా సిరీస్‌ సొంతం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలున్నాయి. కేప్‌టౌన్‌లో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టులోనే పీటర్సన్‌ రెండు అర్ధశతకాలు నమోదు చేయడం గమనార్హం. సిరీస్‌ ఆసాంతం కీలకంగా వ్యవహరించినందుకు పీటర్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’తో పాటు, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని