GGT vs DCW: లూరా, గార్డెనర్‌ అర్ధశతకాలు.. దిల్లీ లక్ష్యం 148

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దిల్లీకి 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 16 Mar 2023 21:14 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. లూరా వోల్వార్డ్‌ (57; 45 బంతుల్లో 6×4, 6×1), గార్డెనర్‌ (51 నాటౌట్‌; 33 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో చెలరేగారు. డియోల్‌  (31) రాణించారు.  దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జొనాస్సేన్‌ 2 వికెట్లు పడగొట్టగా, అరుంధతి రెడ్డి, మరిజెన్నే తలో వికెట్‌ పడగొట్టారు.

బ్యాటింగ్‌ ప్రారంభించిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌  సోఫియా (4) తక్కువ పరుగులకే వెనుదిగింది. మరిజెన్నే వేసిన తొలి ఓవర్‌ చివరి బంతికే జోనాస్సేన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డియోల్‌తో కలిసి మరో పెనర్‌ వోల్వార్డ్‌ ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. రెండో వికెట్‌ను కూడా జోనాస్సేన్‌ చేజిక్కించుకుంది. ఆమె వేసిన 9.5వ బంతికి భాటియాకు క్యాచ్‌ ఇచ్చి డియోల్‌ వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గార్డెనర్‌తో కలిసి వోల్వార్డ్‌ జోరు పెంచింది. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డు వేగం పెంచారు. ఆచితూచి ఆడుతూ.. వీలుదొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 134 పరుగులు చేశారు. అయితే, అరుంధతి వేసిన 18.4వ బంతికి వోల్వార్డ్‌ బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన  హేమలత కేవలం ఒక్క పరుగుమాత్రమే చేసి ఔటయ్యింది. దీంతో గుజరాత్‌ కేవలం 147 పరుగులకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు