GGw vs DCw: మారిజేన్ కాప్ ‘ఐదు’.. దిల్లీ ముందు స్వల్ప లక్ష్యం
డబ్ల్యూపీఎల్ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్ (DCw) తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ (GGw) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్ (DCw) తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ (GGw) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. కిమ్ గార్త్ (32) టాప్ స్కోరర్. జార్జియా వేర్‌హామ్ (22), హర్లీన్ డియోల్ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దిల్లీ బౌలర్ మారిజేన్ కాప్ ఐదు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే మూడు, రాధాయాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టుకు తొలి ఓవర్‌లోనే మారిజేన్ షాక్ ఇచ్చింది. సబ్బినేని మేఘన (0)ను రెండో బంతికే మారిజేన్ కాప్ క్లీన్ బౌల్డ్ చేసి ఆ ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మారిజేన్ తన తర్వాతి ఓవర్(ఇన్నింగ్స్ మూడో ఓవర్)లో రెండో బంతికి వోల్వార్డ్ట్ (1), మూడో బంతికి ఆష్లీ గార్డ్‌నర్ (0)ను ఔట్ చేసింది. శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో హేమలత (5) యాస్తిక భాటియాకు చిక్కింది. తన మూడో ఓవర్‌లో హర్లీన్ డియోల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మారిజేన్ కాప్.. నాలుగో ఓవర్ (ఇన్నింగ్స్ ఏడో ఓవర్)లో సుష్మా వర్మ (2)ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకుంది.
33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జార్జియా, కిమ్ గార్త్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న వేర్‌హామ్‌ను 13 ఓవర్‌లో రాధాయాదవ్ క్లీన్‌బౌల్డ్ చేసింది. 19 ఓవర్‌లో తనుజా కన్వార్ (13), స్నేహ్ రాణా (2)లను శిఖా పాండే ఔట్ చేసింది. జొనాసెన్ వేసిన చివరి ఓవర్‌లో 9పరుగులు రావడంతో గుజరాత్ స్కోరు 100 దాటింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్
-
Sports News
IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు