GGw vs DCw: షెఫాలీ పరుగుల సునామీ.. గుజరాత్‌పై దిల్లీ ఘన విజయం
డబ్ల్యూపీఎల్ (WPL)లో దిల్లీ క్యాపిటల్స్‌కు మూడో విజయం. గుజరాత్‌తో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో దిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో దిల్లీ క్యాపిటల్స్‌కు మూడో విజయం. గుజరాత్‌తో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో దిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (76; 28 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీర విహారం చేసింది. షెఫాలీ 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ మెగ్ లానింగ్ (21*) ఆమెకు చక్కని సహకారం అందించింది.
ఫోర్లు, సిక్సర్ల మోత
లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్‌లో మినహా మిగతా ఓవర్లలో షెఫాలీ వరుస బౌండరీలతో విరుచుకుపడింది. తనుజా వేసిన రెండో ఓవర్‌లో 6,4 బాదిన ఆమె.. కిమ్ గార్త్ వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. ఆష్లీ గార్డ్‌నర్ వేసిన నాలుగో ఓవర్‌లో షెఫాలీ వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదింది. ఇదే ఓవర్‌లో లానింగ్ రెండు బౌండరీలు కొట్టింది. తనుజా వేసిన ఆరో ఓవర్‌లో షెఫాలీ నాలుగు, ఐదు బంతులను బౌండరీ అవతలికి పంపడంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ 87/0 స్కోరుతో నిలిచింది. మాన్సీ వేసిన ఏడో ఓవర్‌లో షెఫాలీ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదింది. జార్జియా వేసిన ఎనిమిదో ఓవర్‌లో మొదటి బంతికి లానింగ్ ఫోర్ బాది దిల్లీకి విజయాన్ని అందించింది.
మారిజేన్ ‘ఐదు’.. 33కే ఆరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు.. దిల్లీ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కిమ్ గార్త్ (32) టాప్ స్కోరర్. జార్జియా వేర్‌హామ్ (22), హర్లీన్ డియోల్ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. తొలి ఓవర్‌లోనే మారిజేన్ షాక్ ఇచ్చింది. సబ్బినేని మేఘన (0)ను రెండో బంతికే మారిజేన్ కాప్ క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మారిజేన్ తన తర్వాతి ఓవర్ (ఇన్నింగ్స్ మూడో ఓవర్)లో రెండో బంతికి వోల్వార్డ్ట్ (1), మూడో బంతికి ఆష్లీ గార్డ్‌నర్ (0)ను ఔట్ చేసింది. శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో హేమలత (5) యాస్తిక భాటియాకు చిక్కింది. తన మూడో ఓవర్‌లో హర్లీన్ డియోల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మారిజేన్ కాప్.. నాలుగో ఓవర్ (ఇన్నింగ్స్ ఏడో ఓవర్)లో సుష్మా వర్మ (2)ను ఔట్ చేసిన ఐదు వికెట్ల ఘనతను అందుకుంది. దీంతో 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జార్జియా, కిమ్ గార్త్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న వేర్‌హామ్‌ను 13 ఓవర్‌లో రాధాయాదవ్ క్లీన్‌బౌల్డ్ చేసింది. 19 ఓవర్‌లో తనుజా కన్వార్ (13), స్నేహ్ రాణా (2)లను శిఖా పాండే ఔట్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్