WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
గుజరాత్ జెయింట్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్ సత్తా చాటింది. గుజరాత్ జెయింట్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్రేస్ హ్యారిస్ (72; 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులకు తోడు తాహిలా మెక్‌గ్రాత్ (57; 38 బంతుల్లో 11 ఫోర్లు), అర్ధ శతకంతో రాణించడంతో ఈ లక్ష్యాన్ని యూపీ19.5 ఓవర్లలో 7వికెట్లను నష్టపోయి ఛేదించింది. దేవికా వైద్యా (7), అలీసా హీలే (12), కిరణ్ నవ్‌గిరె (4), దీప్తి శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (19) యూపీని గెలిపించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ రెండు, మోనికా పటేల్, ఆష్లీన్ గార్డ్‌నర్, తనుజా కన్వర్, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ బ్యాటర్లలో హేమలత (57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆష్లీన్ గార్డ్‌నర్ (60; 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో మెరిశారు. సోఫీ డంక్లీ (23), లారా వోల్వార్డ్ట్ (17) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ (4) నిరాశపర్చింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అంజలి శ్రావణి, ఎకిల్ స్టోన్ ఒక్కో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!