Gunshots: పాక్‌లో ఇంగ్లాండ్ టీమ్ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!
పాక్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్(England Cricket Team) టీమ్ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు(gunshots) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: పాక్-ఇంగ్లాండ్(PAK Vs ENG) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు నేపథ్యంలో ఓ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్(England Cricket Team) టీమ్ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు(gunshots) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్(Multan)లో ఇంగ్లాండ్ జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలో గురువారం కాల్పుల శబ్దం వినిపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. హోటల్‌కు కిలోమీటర్ దూరంలో లోకల్ గ్యాంగ్స్ మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని.. ఇందుకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం.
పాక్(Pakistan)లో పర్యటించే ఇతర దేశాల క్రికెట్ జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్న విషయం తెలిసిందే. గతంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం ఆ దేశంలో ఇతర దేశాల జట్లు పర్యటించేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో పలు దేశాలు పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ముప్పు.. ఆ దేశంలో నిర్వహించే సిరీస్‌లపై ప్రభావం చూపించే అవకాశముంది. దీంతో విదేశీ ఆటగాళ్లకు పీసీబీ భారీ భద్రత కల్పిస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది పాక్‌లో నిర్వహించే ఆసియా కప్(Asia Cup 2023)లో భారత్(Team India)పాల్గొనడంపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక పరుగుల వరద పారించిన మొదటి టెస్టులో పాక్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం