చాలా బాధగా ఉంది: రాహుల్‌

టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌కు దురదృష్టం వెంటాడుతోంది. గత ఏడాది నుంచి పరుగుల వరద పారిస్తున్నా.. టెస్టు తుదిజట్టుకు ఎంపిక చేయకుండా జట్టు యాజమాన్యం అతడి ఓపికను...

Published : 07 Jan 2021 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను దురదృష్టం వెంటాడుతోంది. గత ఏడాది నుంచి పరుగుల వరద పారిస్తున్నా.. టెస్టు తుదిజట్టుకు ఎంపిక చేయకుండా జట్టు యాజమాన్యం అతడి ఓపికను పరీక్షిస్తోంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ విఫలమవ్వడం, మిడిలార్డర్‌లో హనుమవిహారి సత్తాచాటలేకపోవడంతో రాహుల్‌ సిడ్నీ టెస్టులో ఆడతాడని అందరూ భావించారు. కానీ, ఎడమచేతి మణికట్టు బెణకడంతో అతడు చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు.

దీంతో కంగారూల గడ్డ నుంచి స్వదేశానికి బయలుదేరనున్న కేఎల్‌ రాహుల్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. ‘‘జట్టును వీడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. చివరి రెండు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించాలని ఆశిస్తున్నా’’ అని ట్వీటాడు. కాగా, రాహుల్‌ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ట్వీట్‌పై కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే గత ఏడాది న్యూజిలాండ్ పర్యటనలోనూ రాహుల్‌కు ఇదే అనుభవం ఎదురైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటినప్పటికీ టెస్టుల్లో అతడికి అవకాశం ఇవ్వలేదు.

ఇదీ చదవండి

రోహిత్‌వైపే అందరి చూపు!

సిడ్నీ టెస్టుకు జట్టును ప్రకటించిన భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని