Olympics: ఒలింపిక్స్‌కు వచ్చే వరకు తెలియదు.. ఇరు దేశాల పతాకాలు ఒకటేనని!
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ మహా క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పాల్గొంటాయనే విషయం తెలిసిందే. ఒలింపిక్స్ వేదికపై పరేడ్‌లో భాగంగా తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆయా దేశాల అథ్లెట్లు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అయితే, 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో హైతీ, లీచెన్‌స్టైన్ దేశాలకు చెందిన అథ్లెట్లు
ఇంటర్నెట్ డెస్క్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ మహా క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పాల్గొంటాయనే విషయం తెలిసిందే. ఒలింపిక్స్ వేదికపై పరేడ్‌లో భాగంగా తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆయా దేశాల అథ్లెట్లు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అయితే, 1936లో బెర్లిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో హైతీ, లీచెన్‌స్టైన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పతాకాల ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకో తెలుసా? ఆ రెండు దేశాల జాతీయ పతకాలు ఒకేలా ఉన్నాయి మరి.
ఇరు దేశాల పతాకాల్లో అడ్డంగా రెండు రంగుల చారలు(పైన నీలిరంగు, కింద ఎరుపు రంగు) మాత్రమే ఉన్నాయి. దీన్ని గమనించిన ఇరు దేశాలు భవిష్యత్తులో సమస్యలు తలెత్తొచ్చని భావించి పతాకాల్లో మార్పులు చేశాయి. లీచెన్‌స్టైన్ పతాకంలో పసుపు రంగులో కిరీటాన్ని జోడించారు. ప్రజలు.. ఆ దేశ రాజులకు మధ్య ఉన్న ఐక్యతకు గుర్తుగా ఈ కిరీటం చిహ్నాన్ని నీలిరంగు చారలో ఎడవైపు పైభాగాన పెట్టారు. ఇక హైతీ ప్రభుత్వమేమో కాలక్రమంలో ఒకసారి కాదు.. అనేక సార్లు పతాకాన్ని మార్చింది. ప్రస్తుతం నీలి, ఎరుపు రంగు చారల మధ్యలో కొబ్బరి చెట్లు.. దాని కింద ఆయుధాలు ఉన్న చిహ్నాన్ని ఉంచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. తోసిపుచ్చిన బైడెన్!
-
Sports News
Virat Kohli: లతాజీని కలిసి మాట్లాడలేకపోయా..!: విరాట్ కోహ్లీ
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం