కేంద్ర మంత్రికి షాకిచ్చిన హనుమ విహారి

తనను అవమానిస్తూ ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్‌మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే....

Published : 14 Jan 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను అవమానిస్తూ ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్‌మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమవిహారి ఎలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న జట్టును ఓటమి పాలవ్వకుండా ఉండేందుకు అశ్విన్‌తో కలిసి 259 బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడు పోరాడిన తీరుకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా ట్వీట్‌ చేశారు.

‘7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమ్‌ఇండియా చారిత్రక విజయాన్ని హనుమబిహారి చంపేయడమే కాదు క్రికెట్‌ను హత్య చేశాడు. గెలుపు అవకాశాలు నిలపలేని అతడు ఒక నేరస్థుడు. నోట్‌: క్రికెట్‌ గురించి నాకేమీ తెలియదని నాకు తెలుసు’ అంటూ జనవరి 11న సుప్రియో ట్వీట్‌ చేశాడు. విహారిని అవమానించడమే కాకుండా అతడి పేరును ‘బిహారి’ అని రాశాడు. దీనికి ఈ తెలుగు క్రికెటర్‌ అత్యంత హుందాగా.. చతురతతో స్పందించాడు. ‘హనుమ విహారి’ అని మంత్రికి బదులిచ్చాడు. దాంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చావని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఐపీఎల్‌ వల్లే ఆటగాళ్లకు గాయాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని