
Harbhajan Singh: ఈసారి కప్పు బెంగళూరుదే.. గట్టి నమ్మకం: భజ్జీ
ఇంటర్నెట్‌డెస్క్: భారత టీ20 మెగాటోర్నీ 15వ సీజన్‌లో ఈసారి బెంగళూరు టీమ్ విజేతగా నిలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఆ జట్టు ఫైనల్లో గుజరాత్‌తో తలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన భజ్జీ బెంగళూరు జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఈసారి బెంగళూరు జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ చూసినా ట్రోఫీ అందించే ఆటగాళ్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈరోజు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చలాయిస్తుందనే నమ్మకం ఉంది. అదే జరిగితే ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఈసారి కచ్చితంగా ట్రోఫీ అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాజస్థాన్‌ను ఓడించాలంటే ఆ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలి. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలి. ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాలి. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌ను కూడా ఇంకో సాధారణ మ్యాచ్‌లా తీసుకొని ఆడాలి. ఒత్తిడికి గురవ్వద్దు. ప్లేఆఫ్స్ కోసం బెంగళూరు చాలా కష్టపడింది. అలాంటి జట్టును ఇకపై ఓడించడం కష్టం’ అని హర్భజన్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం
-
Business News
Windfall tax: ‘ఎక్సైజ్’తో పోయింది.. ‘విండ్‌ఫాల్’తో వస్తోంది!
-
Politics News
Telangana News: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం
-
Politics News
BJP: కేసీఆర్ నుంచి మేం అవినీతి నేర్చుకోవాలా? కుటుంబ పాలనా?: కేంద్రమంత్రులు ధ్వజం
-
India News
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
-
Sports News
IND vs ENG: బెన్‌స్టోక్స్ ఔట్.. ఇంగ్లాండ్ ఆరో వికెట్ డౌన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి