Team India: టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌.. కాదంటేబుమ్రా : హర్భజన్

టీమ్‌ఇండియా టెస్టు సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా 1-2 తేడాతో ఓటమిపాలయ్యాక విరాట్‌ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే...

Updated : 27 Jan 2022 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా 1-2 తేడాతో ఓటమిపాలయ్యాక విరాట్‌ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అంతకుముందే అతడు టీ20, వన్డేల కెప్టెన్‌గానూ వైదొలిగాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రోహిత్‌ శర్మపైనే పడింది. మూడు ఫార్మాట్లలో అతడే జట్టును నడిపించాలని అటు అభిమానులు, ఇటు మాజీలు భావిస్తున్నారు. కానీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రోహిత్‌ పేరునే తన తొలి అభిప్రాయంగా వెల్లడించాడు. అతడు కాదంటే పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నాడు. ‘రోహితే మూడు ఫార్మాట్లలో నాయకత్వం వహించాలని నేను ఆశిస్తున్నాను. అది కూడా అతడు ఫిట్‌గా ఉంటేనే. ఒకవేళ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి అతడు సానుకూలంగా లేకపోతే.. టెస్టు క్రికెట్‌ బాధ్యతల్ని బుమ్రాకు అప్పగించాలి. ఎందుకంటే ఫాస్ట్‌ బౌలర్లు చాలా సానుకూలంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు కపిల్‌ దేవ్‌ కూడా కెప్టెన్సీ చేశాడు. ఆయన కూడా బౌలరే. అలాంటప్పుడు ఇప్పుడెందుకు బౌలర్లు కెప్టెన్సీ చేపట్టొద్దు..? టీమ్‌ఇండియా మ్యాచ్‌ విన్నర్లలో బుమ్రా కీలక వ్యక్తి. అతడెన్నో విజయాలు అందించాడు. కాబట్టి, రోహిత్‌ ఒప్పుకోకపోతే బుమ్రా పేరును పరిశీలించాలి’ అని మాజీ స్పిన్నర్‌ తన ఆలోచనలు పంచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని