
MS Dhoni: ధోనీ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టిన హర్భజన్ సింగ్.. అదేంటంటే?
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్‌తో ఇతర ఆటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బైక్ రేసింగ్, ఫుట్ బాల్‌కు ధోనీ ప్రాధాన్యం ఇస్తాడు. భారత జట్టుకు ఆడుతున్న సమయంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇతర క్రికెటర్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాడు. బైక్‌లంటే ధోనీకి తెగ ఇష్టం. ఎన్నో ఖరీదైన బైక్‌లు అతని గ్యారేజీలో ఉన్నాయి. మనకు ధోని గురించి ఇంత వరకే తెలుసు. కానీ, మనకు ‘మిస్టర్ కూల్’గురించి తెలియని మరో ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బయట పెట్టాడు.
ధోనీకి క్రికెట్ కంటే వర్చువల్ గేమింగ్స్ (Esports) ఆడటానికి ఇష్టపడతాడని భజ్జీ వెల్లడించాడు. ఎలక్ట్రానిక్ గేమింగ్స్ ఆడటానికి కంప్యూటర్ మందు గంటల తరబడి కూర్చునేవాడని తెలిపాడు. ధోనీ.. క్రికెట్ కంటే 15 రెట్లకన్నా ఎక్కువ సమయాన్ని వర్చువల్ గేమింగ్స్ కోసం వెచ్చించేవాడని హర్భజన్ వెల్లడించాడు. వర్చువల్ గేమ్స్ అయిన పబ్ జీతోపాటు ఆన్లైన్లో ఫుట్ బాల్, ఇతర ఆటలు ఆడేవాడని పేర్కొన్నాడు.
‘అవును. టీమ్ఇండియాలో ప్రతి క్రికెటర్ వర్చువల్ గేమ్స్ ఆడతారు. నేను కూడా ఆడతాను. భారత మాజీ సారథి ధోనీ క్రికెట్ కంటే 15 రెట్లు ఎక్కువ ఆడి ఉంటాడు. హోటల్ రూంలో అతడు ఎప్పుడూ ఎలక్ట్రానిక్ గేమింగ్స్ ఆడుతూ కనిపించేవాడు. ఫుట్‌బాల్, పబ్జీ, ఇతర ఆటలు ఆడుతుండేవాడు. మా సహచర ఆటగాళ్లందరం జట్లను ఏర్పాటు చేసుకుని వర్చువల్ గేమ్స్ ఆడేవాళ్లం’ అని భజ్జీ వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న అతడిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు రూ.12 కోట్లతో సీఎస్కే రిటెన్షన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీతోపాటు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను కూడా రిటెన్షన్ చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: కోహ్లీ సర్.. మిమ్మల్ని చూడ్డానికి స్కూల్‌కు డుమ్మాకొట్టి వచ్చాను
-
India News
Gujarat riots: మోదీకి క్లీన్ చిట్‌ను సవాల్ చేసిన పిటిషన్ కొట్టివేత
-
World News
Afghanistan earthquake: భారత్ నుంచి అఫ్గానిస్థాన్‌కు సాయం..
-
Crime News
Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం
-
Movies News
Chiru 154: మెగా అప్డేట్ వచ్చేసింది.. కొత్త కబురు చెప్పిన నిర్మాణ సంస్థ
-
Sports News
IND vs PAK: టీమ్ఇండియా మంచి జట్టే.. అందులో సందేహం లేదు కానీ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Samantha: సమంత వ్యూహం ఫలించిందా?
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- ఎంపీపీ భర్త నెలకు రూ.లక్ష అడుగుతున్నారు