
Published : 21 Jan 2022 14:47 IST
Harbhajan : టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు కరోనా
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కరోనా బారిన పడ్డాడు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అయితే స్వల్ప లక్షణాలే ఉన్నాయి. స్వీయ నిర్బంధంలోకి వెళ్లా. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా. నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సురక్షితంగా ఉంటూ జాగ్రత్తలు పాటించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమ్‌ఇండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్, మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌లో అండర్ -19 ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన యువ క్రికెటర్లు ఆరుగురికి ఈ మహమ్మారి సోకింది.
ఇవీ చదవండి
Tags :