Harbhajan singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు ఉండాలి: హర్భజన్ సింగ్
టీమ్‌ఇండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిశ్ నెహ్రా అయితే బాగుంటుందని హర్భజన్ సింగ్ తెలిపాడు.
దిల్లీ: టీమ్‌ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుంది అనే చర్చ గత కొద్ది రోజుల నుంచి నడుస్తోంది. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఆ చర్చను సమర్థించేలా మాట్లాడాడు. టీమ్‌ఇండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిశ్ నెహ్రా అయితే బాగుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. ఎంతోకాలం ద్రవిడ్‌తో పని చేసిన తనకు... ద్రవిడ్ గురించి తెలుసని, ఆటపై అతనికున్న అవగాహన గురించి తెలుసని భజ్జీ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే తరహాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే.
ద్రవిడ్, ఆశిశ్ కలిస్తే...
‘‘టీ20లు కాస్త భిన్నమైనవని.. ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించిన ఆశిశ్ లాంటి వారైతే 2024 ప్రపంచకప్‌నకు మన జట్టును మరింత మెరుగ్గా సన్నద్ధం కావచ్చు. అలాగని ద్రవిడ్‌ను పక్కన పెట్టాలని నేను చెప్పను. ఆశిశ్, రాహుల్ కలసి పనిచేస్తే 2024 ప్రపంచకప్ సమయానికి జట్టును మరింత మెరుగ్గా నిర్మించవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో ద్రవిడ్‌కు విశ్రాంతినిచ్చారు. అలాంటప్పుడు మరో కోచ్ ఉంటే ఆ బాధ్యతలను చూసుకొంటాడుఫార్మాట్‌ను బట్టి ఆటగాళ్లను మార్చాలి’’ అని హర్భజన్ అన్నాడు.
టీ20లను అలానే ఆడాలి
‘‘టీ20 ఫార్మాట్‌లో అవలంబిస్తోన్న పద్ధతి మారాలి. మొదటి 6 ఓవర్లు ఎంతో కీలకం. అది కుదరకపోతే హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ లాంటి ఆటగాళ్లపై ఆశలు పెట్టుకోవాల్సి వస్తుంది. వారు కూడా రాణించలేకపోతే ఇక స్కోర్ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్ తన విధానం మార్చుకోవడం వల్లనే వారు రెండు ప్రపంచకప్‌లను సాధించగలిగారు. అందుకే టీ20లను టీ20ల్లాగే ఆడాలి. వన్డేల్లా కాదు’’ అని సూచించాడు భజ్జీ.
స్ట్రైక్ రేటు పెంచుకోవాలి
‘‘టీమ్‌ఇండియాలో టాప్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. స్ట్రైక్ రేట్‌పై మరింత దృష్టి సారించాలి. మొదటి 10-12 ఓవర్లలో కనీసం ఓవర్‌కు 9 పరుగుల చొప్పున చేయాలి. రోహిత్, కోహ్లీ.. టీ20ల్లో ఆడతారా లేదా అనే విషయంపై నేను స్పందించలేను. వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు. ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఆడతారు. రోహిత్ తర్వాత టీ20లకు కెప్టెన్‌గా ఎవరుంటారనే ప్రశ్నకు నేనైతే హార్దిక్ అనే చెబుతా’’ అని హర్భజన్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు