Published : 17 Mar 2022 01:31 IST

Hardik Pandya: యో - యో టెస్టులో హార్దిక్‌ పాండ్య పాస్‌.. పృథ్వీ షా ఫెయిల్‌

ఇంటర్నెట్ డెస్క్: వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా ఆల్ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య యో-యో టెస్టులో పాసయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రెండు రోజుల ట్రెయినింగ్‌ క్యాంపులో పాల్గొన్న అతడు బుధవారం నిర్వహించిన యో-యో టెస్టులో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు.

‘గాయం నుంచి కోలుకున్న ఆటగాళ్లకే సాధారణంగా ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ ఇస్తుంటాం. అయితే, హార్దిక్‌ పాండ్య విషయం వేరు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సాధారణ పరీక్షల్లో భాగంగానే అతడిని ఫిట్‌నెస్‌ను పరీక్షించాం. ఎన్సీఏలో ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు అతడు బౌలింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ, అతడు 135 కి.మీ. వేగంతో నిలకడగా బంతులేశాడు. యో-యో టెస్టులో 17కి పైగా స్కోరు సాధించాడు. కట్‌ ఆఫ్‌ లెవెల్ కంటే అది ఎక్కువే. భారత క్రికెట్‌కు అతడు గొప్ప ఆస్తి’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ సీజన్‌ నుంచే కొత్తగా ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్న గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

మరోవైపు, టీమ్‌ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా యో-యో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్‌ టెస్టులో పాసవ్వాలంటే కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంటుంది. కానీ, పృథ్వీ షా 15 కంటే తక్కువ స్కోరు నమోదు చేశాడు. ‘ఇటీవల కాలంలో పృథ్వీ షా ఫిట్‌నెస్‌ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అందుకే, ప్రస్తుత భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. యో-యో టెస్టులో పృథ్వీ షా విఫలమైనా ఇబ్బంది ఏం లేదు. అతడు యధావిధిగా ఐపీఎల్‌లో ఆడవచ్చు. ఇది కేవలం ఫిట్‌నెస్‌కు ఓ కొలమానం మాత్రమే. ఇటీవల అతడు వరుసగా మూడు రంజీ మ్యాచులు ఆడాడు. అది కూడా యో-యో స్కోరుపై ప్రభావం చూపించి ఉండొచ్చు’ అని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని