Hardik Pandya: ‘హార్దిక్‌ కూడా అందరిలాంటోడే..’

తన సోదరుడు హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్‌ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు.

Published : 06 Jul 2024 06:43 IST

ముంబయి: తన సోదరుడు హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్‌ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్‌-17లో రోహిత్‌ స్థానంలో ముంబయి కెప్టెన్‌ అయినపుడు హార్దిక్‌పై అభిమానులు చూపించిన వ్యతిరేకత పట్ల అతను ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్‌ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషే అని అందరూ మరిచిపోయారని కృనాల్‌ అన్నాడు. ‘‘నేను, హార్దిక్‌ పదేళ్లుగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్నాం. గత కొన్ని రోజుల్లో జరిగింది చూస్తే మా కలలు నెరవేరినట్లయింది. నా సోదరుడు సాధించింది చూసి నేనెంతో ఉద్వేగానికి గురయ్యాను. గత ఆరు నెలలు అతడికి చాలా కష్టంగా గడిచాయి. జనాలు అతణ్ని ఎగతాళి చేయడంతో పాటు అనేక చెడు మాటలు అన్నారు. అతను కూడా అందరిలాగే భావోద్వేగాలు కలిగిన మనిషే అనే విషయాన్ని అందరం మరిచిపోయాం. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్‌ పూర్తిగా అర్హుడు’’ అని కృనాల్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని