Hardik Pandya: నాన్నను గుర్తు తెచ్చుకుని.. హార్దిక్‌ భావోద్వేగం

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతడు.. జట్టు నెగ్గగానే మరణించిన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు.

Updated : 21 Nov 2022 15:30 IST

మెల్‌బోర్న్‌: భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతడు.. జట్టు నెగ్గగానే మరణించిన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘‘ఇప్పుడు మా నాన్న గురించే ఆలోచిస్తున్నా. ఆయన నాకు చేసినట్లే నేను నా ప్రియ తనయుడికి చేయగలనా అని అనుకుంటున్నా. ఎందుకంటే మా క్రికెట్‌ కలను నెరవేర్చడం కోసం మా నాన్న వ్యాపారాన్ని వదిలి ఒక నగరం నుంచి మరొక నగరానికి కుటుంబాన్ని తీసుకెళ్లేవాళ్లు. ఆయన ఇలా మాపై నమ్మకం ఉంచకపోతే నేను, కృనాల్‌ ఈ స్థితిలో ఉండేవాళ్లం కాదు. ఈ త్యాగాలకు ఎంతో రుణపడి ఉన్నాం’’ అని హార్దిక్‌ ఉద్వేగంగా అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని