Hardik pandya: పాండ్యా భారత జట్టును నడిపించగల సమర్థుడే: రషీద్ ఖాన్
భారత జట్టును నడిపించగలిగే సామర్థ్యం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉందని అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ అన్నాడు.
దిల్లీ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్(IND vs NZ) సందర్భంగా టీమ్‌ఇండియా(Team india) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik pandya) కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతడి నేతృత్వంలో ఈ సిరీస్‌ను భారత్ గెలుపొందడంతో పాండ్యాపై సీనియర్లు ప్రశంసలు కురిపించారు. పొట్టి ఫార్మాట్‌లో పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలను పాండ్యాకు అప్పగిస్తే బాగుంటుదని పలువురు సూచించారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్(Afghanistan) లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును నడిపించగల సత్తా ఈ ఆల్‌రౌండర్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్‌లో అతడు గుజరాత్‌ను నడిపించిన తీరే ఇందుకు నిదర్శనమని తెలిపాడు.
‘‘నేను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడాను. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం ఉన్నాయి. భారత టీ20 లీగ్ సమయంలోనే తనను తాను రుజువు చేసుకున్నాడు. గుజరాత్ జట్టులో ఆడినప్పుడు అతడి కెప్టెన్సీని మేమెంతో ఆస్వాదించాం’’ అంటూ రషీద్ తెలిపాడు. ఈ సందర్భంగా టీ10 లీగ్‌లో ఉన్న సవాళ్లపై సైతం అతడు స్పందించాడు.‘‘ఇందులో ఆడాలంటే క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఒడ్డున పడేయగల విభిన్న ఫార్మాట్‌ను కలిగి ఉండాలి. దేశం తరఫున ఆడే మ్యాచ్‌ల్లో ఇటువంటి ప్రణాళిక మనల్ని మానసికంగా దృఢంగా ఉంచుతుంది. అందుకు కాస్త తెలివైన ఆటతీరు అవసరం. బ్యాటర్లు తొలి బంతి నుంచే బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే అప్రమత్తంగా ఉంటూనే విభిన్నంగా ఆడగలగాలి. తమపై తాము పూర్తి విశ్వాసాన్ని కలిగి వుండాలి. అప్పుడే రాణించగలం’’ అంటూ తన విజయ రహస్యాన్ని పంచుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్