wasim jaffer: పాండ్యా అలాంటి కెప్టెన్‌ కాదు: వసీం జాఫర్‌

హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 22 Nov 2022 18:17 IST

దిల్లీ: రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యాపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం ప్రశంసలు కురిపించాడు. భారత టీ20 లీగ్‌ సమయంలోనే అతడి సత్తా ఏంటో చూపాడని అన్నాడు. ఈ కెప్టెన్‌ అందరిలా సురక్షితంగా ఆడాలని కోరుకోడంటూ వ్యాఖ్యలు చేశాడు. ముందు ముందు పాండ్యా మెరుపులు మరిన్ని చూడబోతున్నామని పేర్కొన్నాడు. 

‘‘ఆట పరంగా హార్దిక్‌ పాండ్యా ఎంతో పరిణితి చెందాడు. భారత టీ20 లీగ్‌ సమయంలో అందరినీ కలుపుకొంటూ ఆడిన తీరు చూసి ఇతడు ఆటగాళ్ల ఫేవరెట్‌ కెప్టెన్‌లా కనిపించాడు. జట్టు అంతా అతడికి స్పందించడం చూశాను. అలాగే మ్యాచ్‌లో తన ప్రదర్శన సైతం ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. అది చాలా  మంచి విషయం. అందుకే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఈ ఆల్‌రౌండర్‌ లెక్కలు వేసుకుని రక్షణాత్మక ధోరణితో ఆడే కెప్టెన్ కాదు. తాడో పేడో తేల్చుకునే రకం. భవిష్యత్తులోనూ అతడు జట్టుకు నాయకత్వం వహిస్తే ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో చూస్తారు’’ అంటూ వసీం జాఫర్‌ కొనియాడాడు. భారత టీ20 లీగ్‌ 2022లో గుజరాత్‌ను నడిపించిన పాండ్యా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని