Hardik Pandya: హార్దిక్‌ దూరం

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య విజయ్‌ హజారె ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం కోసమే హార్దిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘

Updated : 08 Dec 2021 07:22 IST

దిల్లీ: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య విజయ్‌ హజారె ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం కోసమే హార్దిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘‘విజయ్‌ హజారె ట్రోఫీకి అందుబాటులో ఉండగలవా అంటూ హార్దిక్‌కు బరోడా క్రికెట్‌ సంఘం (బీసీఏ) ఇమెయిల్‌ పంపింది. గత మూడేళ్లలో బరోడా తరపున అతను చాలా అరుదుగా ఆడాడు. అయితే ప్రస్తుతం తాను ముంబయిలో ఫిట్‌నెస్‌ శిబిరంలో ఉన్నట్లు ఒకేఒక్క లైన్‌లో అతను బదులిచ్చాడు. హార్దిక్‌కు ఎలాంటి గాయమైందో బీసీఏకు కూడా తెలియదు’’ అని బీసీఏ అధికారి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని