Hardik Pandya: ధోనీ ఇచ్చిన ఆ సలహా వల్లే బాగా ఆడుతున్నా: హార్దిక్‌ పాండ్య

భారత జట్టులో విధ్వంసకర బ్యాటింగ్‌, తెలివైన బౌలింగ్‌తో మంచి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్న హార్దిక్‌ పాండ్య.... ఉన్నట్టుండి ఫామ్‌, ఫిట్‌నెస్‌ సమస్యలతో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఇక అతడి పనైపోయినట్లే అని అంతా భావించారు.

Published : 19 Jun 2022 01:25 IST


ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో విధ్వంసకర బ్యాటింగ్‌, తెలివైన బౌలింగ్‌తో మంచి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్న హార్దిక్‌ పాండ్య.... ఉన్నట్టుండి ఫామ్‌, ఫిట్‌నెస్‌ సమస్యలతో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. ఇక అతడి పనైపోయినట్లే అని అంతా భావించారు. ఇదంతా రెండున్నర నెలలకు ముందు కథ. ఇప్పుడు హార్దిక్ బ్యాటింగ్‌లో అదరగొడుతూ మునుపటి ఫామ్‌ని అందుకున్నాడు. ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌కు సారథ్యం వహించిన అతడు జట్టుని ఛాంపియన్‌గా నిలిపాడు. 15మ్యాచ్‌ల్లో  487 పరుగులు చేసి బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 153.94 స్ట్రైక్‌రేట్‌తో  117 పరుగులు సాధించి భారత్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఐర్లాండ్‌ సిరీస్‌కు సారథిగా ఎంపికై టీమ్‌ఇండియా భవిష్యత్‌ కెప్టెన్‌ రేసులో నిలిచాడు. ఈ క్రమంలో  పాండ్య తాను నిలకడగా రాణిస్తూ.. స్వేచ్ఛగా షాట్లు ఆడడానికి గల కారణాన్ని వివరించాడు. ‘మహీ భాయ్ (ధోనీ) నాకు ఒక విషయం నేర్పాడు. నేను అతన్ని ‘ఒత్తిడిని ఎలా అధిగమిస్తావు’? అని అడిగా.  దీనికి ధోనీ ... నువ్వు బ్యాటింగ్‌ చేసేటప్పుడు  ‘నీ వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించడం మానేసి జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడటంపై దృష్టి పెట్టు’ అని సలహా ఇచ్చాడు. ఈ సూచన నేను మెరుగైన ఆటగాడిగా మారేందుకు ఉపయోగపడింది’ అని హార్దిక్‌ వెల్లడించాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని