Hardik Pandya: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. టీమ్ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య!

త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య సారథ్యం వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. 

Published : 11 Jul 2024 00:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం టీమ్ఇండియా.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతోంది. ఈ నెలఖారులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రాలు లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. హార్దిక్ పాండ్య (Hardik Pandya) లంకతో పొట్టి సిరీస్‌కు నాయకత్వం వహించే అవకాశమున్నట్లు సమాచారం.

ఐపీఎల్‌ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కేఎల్ రాహుల్ శ్రీలంకతో వన్డే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌కు అతడు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై 14న జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్ ముగుస్తుంది. అనంతరం శ్రీలంకతో టీమ్ఇండియా జులై 27-30 మధ్య మూడు టీ20లు, ఆగస్టు 2-7 మధ్య మూడు వన్డేలు ఆడనుంది.

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా గంభీర్‌ ఏం చేస్తాడో!

కాగా.. టీ20 ప్రపంచ కప్‌ను భారత్ అందుకోవడంలో చివరి ఓవర్‌లో హార్దిక్‌ అత్యంత కీలకంగా వ్యవహరించాడు. మెరుగైన ప్రదర్శనతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించాడు. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. అయితే.. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని