Haris rauf: ఆ మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో డీకే, పాండ్యా ఉండుంటే బాధపడేవాడిని: హరీస్‌ రవూఫ్‌

టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో విరాట్‌ సిక్సులపై పాక్‌ ఆటగాడు హరీస్‌ రవూఫ్‌ స్పందించాడు. 

Published : 01 Dec 2022 13:12 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన పోరును విరాట్‌ కోహ్లీ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరేమో. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన కోహ్లీ  53 బంతుల్లో 82 పరుగులు చేసి ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. పాక్‌ జట్టులో ప్రమాదకర బౌలర్‌గా పేరున్న హరీస్‌ రవూఫ్‌ వేసిన బంతులకు కోహ్లీ వరుసగా రెండు సిక్సులు బాది చివరి ఓవర్‌లో అద్భుతం చేశాడు. 

తాజాగా ఈ విషయంపై రవూఫ్‌ స్పందించాడు. కోహ్లీలా మరే ఆటగాడు బ్యాటింగ్‌ చేయలేడని అన్నాడు. ‘‘ప్రపంచకప్‌లో విరాట్‌ ఆడిన విధానం అతడి స్థాయిని తెలియజేస్తుంది. అతడెలాంటి షాట్లు ఆడగలడో మనందరికీ తెలుసు. ఆ రోజు మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో ఎవరున్నా నేను విసిరిన బంతులకు అలాంటి షాట్లు ఆడలేకపోయేవారేమో. అయితే, అవి కోహ్లీ కొట్టిన సిక్సులు కాబట్టి సరిపోయింది. అతడు కాకుండా దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా అయ్యుంటే నేను చాలా బాధపడేవాడిని. కోహ్లీ అందరికన్నా విభిన్నమైన శ్రేణి ఆటగాడు’’ అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవూఫ్‌ వివరించాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని