Hockey: చిరకాల ప్రత్యర్థిపై.. తిరుగులేని విజయం.. సెమీస్‌కు భారత్‌

ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో భారత హకీ జట్టు మరో ముందడుగు వేసింది. శుక్రవారం రౌండ్ రాబిన్‌ పద్ధతిలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తిరుగులేని విజయం సాధించింది.

Published : 17 Dec 2021 22:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో భారత జట్టు మరో ముందడుగు వేసింది. శుక్రవారం రౌండ్ రాబిన్‌ పద్ధతిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తిరుగులేని విజయం సాధించింది. దీంతో భారత్‌ సెమీ ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్ (8వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్‌, ఆకాశ్ దీప్‌ సింగ్‌ (42వ నిమిషం) ఓ గోల్ కొట్టారు. దీంతో భారత్‌ 3-1 తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. పాక్ ఆటగాడు జునైద్‌ మంజూర్‌ (45వ నిమిషం)లో ఒక గోల్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా.. చివరి సారిగా పాక్‌తో ఆడిన మ్యాచ్‌లో కూడా భారత్‌ 3-1 గోల్స్‌తో నెగ్గడం గమనార్హం.  

ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా రెండో విజయం. ఇంతకు ముందు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ 9-0 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కొరియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందిన భారత హాకీ జట్టు.. ఏడు పాయింట్లు సాధించింది. దీంతో ఐదు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో భాగంగా ఆదివారం జపాన్‌తో తన చివరి మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది.

Read latest Sports News and Telugu News




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని