Harmanpreet Kaur: మిథాలీ రికార్డును హర్మన్‌ప్రీత్‌ బద్దలు కొడుతుందా?

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్కు చేరువైంది. టీ20ల్లో ఆమె మరో 45 పరుగులు చేస్తే భారత మహిళల జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలవనుంది. ఇటీవల అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు

Published : 22 Jun 2022 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్కు చేరువైంది. టీ20ల్లో ఆమె మరో 45 పరుగులు చేస్తే భారత మహిళల జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలవనుంది. ఇటీవల అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ (89 మ్యాచ్‌ల్లో 2364 పరుగులు) అగ్రస్థానంలో ఉంది. హర్మన్‌ ప్రీత్‌ (121 మ్యాచ్‌ల్లో  2319 పరుగులు) రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూన్‌ 23 నుంచి దంబుల్లాలో శ్రీలంకతో టీమ్‌ఇండియా మూడు టీ 20 మ్యాచ్‌లు (జూన్ 23, 25, 27) ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి క్యాండీలో మూడు వన్డేలు (జులై 1, 4, 7, తేదీల్లో) జరుగుతాయి. ఈ టీ20 సిరీస్‌లో మిథాలీ రికార్డును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది. హర్మన్‌ప్రీత్ 2009లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత మహిళల జట్టుకు కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2018 టీ20 ప్రపంచకప్‌లో ఆమె న్యూజిలాండ్‌పై శతకం బాదింది. ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున శతకం బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్‌ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సెలెక్షన్‌ కమిటీ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని