Womens T20: ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ను ఓడించిన హర్మన్‌ప్రీత్‌ జట్టు

మహిళల ఛాలెంజర్‌ టీ20 టోర్నీలో ఢిపెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌.  స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు ఓడించింది. సమష్టిగా చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ సేన 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 24 May 2022 02:27 IST

పుణె: మహిళల ఛాలెంజర్‌ టీ20 టోర్నీలో ఢిపెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌.  స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు ఓడించింది. సమష్టిగా చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ సేన 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్‌కౌర్‌ (37: 29 బంతుల్లో 4X4), హర్లీన్‌ డియోల్‌ (35: 19 బంతుల్లో 5X4), డాటిన్‌ (32: 17 బంతుల్లో 5X4, 1X6) రాణించారు. మందాన జట్టులో హేలే మాథ్యూస్‌ మూడు, సల్మా ఖాతూన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం 164 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన మంధాన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులే చేసింది. దీంతో 49 పరుగుల తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది. స్మృతి మంధాన (34: 23 బంతుల్లో 4X4) టాప్‌ స్కోరర్‌. మిగతావారు చేతులెత్తేయడంతో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్‌ జట్టులో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లతో ప్రత్యర్థి జట్టును వణికించింది. అలాన కింగ్‌ రెండు వికెట్లు తీయగా, మేఘన సింగ్‌, సోఫీ తలో వికెట్‌ తీశారు. నాలుగు వికెట్లతో చెలరేగిన పూజా వస్త్రాకర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు