Harshal Patel: జీవితంలో ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతా.. సోదరిపై హర్షల్‌ భావోద్వేగం

బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల అతని సోదరి అర్చిత పటేల్‌ కన్నుమూయడంతో బయోబబుల్‌ వీడి ఇంటికి వెళ్లొచ్చిన అతడు తిరిగి జట్టులో కలిశాడు...

Updated : 18 Apr 2022 15:28 IST

(Photo: Harshal Patel Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల అతడి సోదరి అర్చిత పటేల్‌ కన్నుమూయడంతో బయోబబుల్‌ వీడి ఇంటికి వెళ్లొచ్చిన అతడు తిరిగి జట్టుతో కలిశాడు. ఈ క్రమంలోనే శనివారం బెంగళూరు.. దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో గుండెలో బాధ ఉన్నా బరిలోకి దిగి బౌలింగ్‌ చేశాడు. అయితే, గతరాత్రి తన సోదరిని గుర్తుచేసుకున్న హర్షల్‌.. ఆమె చెప్పిన మాటల వల్లే ఈ మ్యాచ్‌లో ఆడానన్నాడు.

‘అక్కా.. నువ్వు మా జీవితాల్లో ఓ గొప్ప వ్యక్తివి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నావు. నేను నీతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. నా ఆటపై దృష్టి పెట్టాలని, నీ గురించి ఆలోచించవద్దని చెప్పావు. ఆ మాటల వల్లే నేను ఇప్పుడు మళ్లీ జట్టుతో కలిసి దిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగాను. ఇప్పుడు నీ కోసం ఇది మాత్రమే చేయగలిగాను. నువ్వు నా గురించి గర్వపడేలా చేసినవన్నీ ఎప్పటికీ అలాగే కొనసాగిస్తా. నా జీవితంలోని ప్రతిక్షణం నిన్ను మిస్‌ అవుతా..నువ్వంటే నాకెంతో ఇష్టం’ అని హర్షల్‌ భావోద్వేగ పోస్టు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని