IND vs ZIM: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌.. భారత జట్టులో పలు మార్పులు

జింబాబ్వేతో త్వరలో జరగనున్న ఐదు టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు భారత జట్టులో పలు మార్పులు చేశారు. 

Updated : 02 Jul 2024 16:54 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్ సారథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మొదటి రెండు టీ20ల కోసం భారత జట్టులో పలు మార్పులు చేశారు. సంజు శాంసన్‌, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో రెండు రోజులుగా భారత ప్రపంచ కప్‌ బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. అందులో శాంసన్‌, దూబె, యశస్వి ఉన్నారు. 

బార్బడోస్‌లో వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో టీమ్ఇండియా స్వదేశం రావడానికి బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బార్బడోస్‌ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. అదేరోజు సాయంత్రం 7.45 గంటలకు దిల్లీకి ఆటగాళ్లు చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేతో మూడో టీ20కి ముందు శాంసన్‌, దూబె, యశస్వి జట్టుతో కలవనున్నారు. మరోవైపు, ఈ ఐదు టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు జింబాబ్వేకు బయల్దేరింది. వీవీఎస్‌ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

జింబాబ్వేతో మొదటి రెండు టీ20లకు భారత జట్టు:  

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌, ముకేశ్ కుమార్‌, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్‌0, హర్షిత్ రాణా.

చివరి మూడు టీ20లకు 

శుభ్‌మన్‌ గిల్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్‌ (కీపర్), ధ్రువ్‌ జురెల్‌ (కీపర్), శివమ్‌ దూబె, రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే.

భారత్‌.. జింబాబ్వే టూర్‌ షెడ్యూల్ 

  • తొలి టీ20 (జులై 6)
  • రెండో టీ20 (జులై 7)
  • మూడో టీ20 (జులై 10)
  • నాలుగో టీ20 (జులై 13)
  • ఐదో టీ20 (జులై 14) 
  • ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని