BCCI: ఎన్సీఏ హెడ్‌ కోచ్ పదవికి లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకోవాలి : బీసీసీఐ

నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌ పదవికి మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ పేర్కొంది. నిబంధనల ప్రకారమే కోచ్‌ను నియమిస్తామని తెలిపింది. ఇంతకు

Published : 05 Dec 2021 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌ పదవికి మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ పేర్కొంది. నిబంధనల ప్రకారమే కోచ్‌ను నియమిస్తామని తెలిపింది. ఇంతకు ముందు ఎన్సీఏ హెడ్‌గా పని చేసిన రాహుల్ ద్రవిడ్‌ నియమాకంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించామని వెల్లడించింది. కోల్‌కతాలో జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు సూచించింది. ఇటీవల రాహుల్ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఎన్సీఏ కోచ్‌ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. 

ఎన్సీఏ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మకాం మార్చాల్సి రావడంతో మొదట్లో లక్ష్మణ్‌ ఆ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రెటరీ జై షా.. అతడితో చర్చలు జరిపిన అనంతరం ఎన్సీఏ కోచ్‌ పదవిని చేపట్టేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్‌.. ఎన్సీఏ కోచ్‌ పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఆ పదవిని వదిలేశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు