Cricket News: 278 బంతుల్లో  37* పరుగులు

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా మరోసారి తన క్లాస్‌తో ఆకట్టుకున్నాడు. తాను డిఫెన్స్‌ ఆడితే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. సౌథాంప్టన్‌ వేదికగా హాంప్‌షైర్‌తో మ్యాచులో అతడు సర్రే తరఫున బరిలోకి దిగాడు....

Updated : 08 Jul 2021 15:35 IST

హాంప్‌షైర్‌కు చుక్కలు చూపించిన ఆమ్లా

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా మరోసారి తన క్లాస్‌తో ఆకట్టుకున్నాడు. తాను డిఫెన్స్‌ ఆడితే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. సౌథాంప్టన్‌ వేదికగా హాంప్‌షైర్‌తో మ్యాచులో అతడు సర్రే తరఫున బరిలోకి దిగాడు. ఆఖరి రోజు 278 బంతులాడి 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. సర్రేను ఓటమి నుంచి కాపాడాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ 488 పరుగులు చేసింది. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 213 బంతుల్లో 174తో రాణించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులే చేసింది. ఆమ్లా (29) టాప్‌ స్కోరర్‌. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ సర్రే కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయింది.

నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా సర్రే జట్టును రక్షించాడు. ఆటలో ఆఖరి రోజంతా నిలబడ్డాడు. తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులే చేశాడు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు తొణకలేదు. ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టాడు. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే 122/8తో నిలిచింది. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దాంతో టీమ్‌ఇండియా నయావాల్‌ పుజారా మాదిరిగా ఆమ్లా జట్టును రక్షించాడని నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని