
Ruthuraj Gaikwad: అతడు అన్ని ఫార్మాట్లకు పనికొస్తాడు: సునీల్ గావస్కర్
(Photo: Ruthuraj Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అన్ని ఫార్మాట్లకు సరిపోతాడని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. టీమిండియా అతడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. ‘రుతురాజ్‌లో అపార నైపుణ్యం ఉంది. అతడి బ్యాటింగ్ శైలి అన్ని ఫార్మాట్లకు సరిపోతుంది. ఎందుకంటే, అతడు షాట్లు ఆడే విధానం, వాటి ఎంపిక గొప్పగా ఉంటుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా నిలకడగా ఆడుతూ పరుగులు చేయగలడు. అందుకే, అతడు అన్ని ఫార్మాట్లకు సరిగ్గా సరిపోతాడు. గైక్వాడ్‌ను మరింత సానబెడితే.. అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడు’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం ప్రకటించిన తుదిజట్టులో రుతురాజ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందే శ్రీలంకతో సిరీస్ సందర్భంగా రుతురాజ్‌కి అవకాశమిచ్చినా.. ప్రభావం చూపలేకపోయాడు. అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించడంతో సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ఐపీఎల్‌లో సీఎస్కే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.