Published : 26 Nov 2021 01:59 IST

IND vs NZ: శ్రేయస్‌ అయ్యర్‌.. అనుభవమున్న ఆటగాడిలా ఆడాడు : వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ఆడుతున్నది తొలి మ్యాచే అయినా ఎంతో పరిణతితో అనుభవమున్న ఆటగాడిలా ఆడాడని పేర్కొన్నాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (75: 136 బంతుల్లో 7x4, 2x6) పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

‘టెస్టు క్రికెట్లో శ్రేయస్‌ అయ్యర్‌కిది తొలి మ్యాచే కావచ్చు. కానీ, చాలా అనుభవమున్న ఆటగాడిలా ఆడాడు. పరిస్థితులను బట్టి ఎప్పుడు దాడి చేయాలో, ఎప్పుడు నిలకడగా ఆడాలో అతడికి బాగా తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి టెస్టు క్రికెట్లోకి మారడం యువ ఆటగాళ్లకు చాలా కష్టం. టెస్టు క్రికెట్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. షాట్ల ఎంపికలో చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా, అయ్యర్‌ వీటన్నింటిని అధిగమించి చాలా పరిణతితో ఆడాడు’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. అజింక్య రహానె సారథ్యంలో టీమ్ఇండియా న్యూజిలాండ్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 258/4 స్కోరుతో నిలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ (75), రవీంద్ర జడేజా (50) క్రీజులో ఉన్నారు.

అయితే యువ క్రికెటర్లు రాణించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (35) మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఇక క్రీజ్‌లో కుదురుకున్నాడు.. భారీ స్కోరు నమోదు చేస్తాడని అందరూ భావించారు. అయితే కీలకమైన సమయంలో కివీస్‌కు వికెట్‌ను ఇచ్చేశాడు. అంతకుముందు బంతికే డీఆర్‌ఎస్‌ ద్వారా బతికి పోయిన రహానె.. దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. తర్వాతి బంతినే ఫ్లిక్‌ చేయబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. దీనిపై లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘‘ రహానె ఆడిన అలాంటి షాట్‌ విదేశాల్లో అయితే అక్కరకొస్తుంది. కాన్పూర్‌ మైదానంలో పనికిరాదు. జేమీసన్‌ వెంటవెంటనే షార్ట్‌పిచ్‌ బంతులను విసిరాడు. అలాంటప్పుడు పుల్‌షాట్‌ కొట్టడమే రహానె ఎదుట ఉన్న ఆప్షన్‌. విదేశాల మైదానాల్లో బౌన్స్‌ ఎక్కువ. కాబట్టి  కట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో అంతగా బౌన్స్‌ రాదు అందుకే రహానె ఆడిన షాట్‌కు బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ను పడగొట్టింది’’ అని వివరించాడు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని