Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?
ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్-16 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తారా లేదా అనే దానిపై ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 (IPL-16) సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఎంచుకుని టీమ్‌ఇండియాలోని కీలక ఆటగాళ్లను ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటారా? అని ప్రశ్నించగా.. ఆ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ( Mark Boucher)ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. లీగ్ దశలో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొడితే కొన్ని మ్యాచ్‌లకు అతనికి విశ్రాంతినిచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.‘రోహిత్ శర్మ విశ్రాంతి గురించి మాట్లాడుకుంటే.. అతను కెప్టెన్. రోహిత్ ఫామ్‌ని అందుకుంటాడని ఆశిస్తున్నాం. అతను విశ్రాంతి కావాలని కోరుకుంటాడని అనుకోవట్లేదు. కానీ, పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాం. కెప్టెన్‌గా, ఆటగాడిగా అతను అత్యుత్తమంగా రాణిస్తే బాగుంటుంది. అప్పుడు ఒకట్రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోని. నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని మార్క్‌బౌచర్ అన్నాడు.
ఈ సీజన్ నుంచి ఐపీఎల్‌లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player) నిబంధనను ప్రవేశపెడుతున్నారు. ఈ నిబంధన కారణంగా ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని పలువరు మాజీ అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ ప్రాధాన్యం తగ్గదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఇది ఆల్ రౌండర్‌పై ప్రభావం చూపుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్‌రౌండర్ ఎప్పుడూ ఆల్‌రౌండర్‌గానే ఉంటాడు. మ్యాచ్ ఏ దశలో ఉన్నా అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఎప్పుడైనా జట్టులోకి తీసుకోవచ్చు. అది ఆల్‌రౌండర్‌పై ప్రభావం చూపుతుందని భావించేట్లేదు’ అని రోహిత్ శర్మ అన్నాడు.
అర్జున్ అరంగేట్రం చేస్తాడా?
సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ 2021 సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ జట్టులో ఉంటున్నాడు. కానీ, అతడు ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. ఈ సారైనా అర్జున్ అరంగేట్రం చేస్తాడా లేదా అనే ప్రశ్నకు రోహిత్.. ‘మంచి ప్రశ్న. అతను అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నాం’ అని సమాధానమిచ్చాడు. ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఏప్రిల్ 2న బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో