IPL: అతడు నెట్స్‌లో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశాడు: కేకేఆర్ బౌలర్‌పై చెన్నై కోచ్ ప్రశంసలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)పై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా స్పిన్నర్‌పై చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. ఆదివారం సీఎస్కేపై కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో రెండు వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించి ఫ్లెమింగ్ స్పందిస్తూ.. అతడు తమను గతంలో నెట్స్‌లో ఇబ్బందులకు గురిచేశాడని గుర్తు చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి చెన్నై(CSK)కి కొంతకాలం నెట్ బౌలర్‌గా సేవలందించాడు. అయితే.. అతడిని వేలంలో దక్కించుకోలేకపోయామని.. అది ఇంకా మమల్ని బాధకు గురి చేస్తూనే ఉందని ఫ్లెమింగ్ తెలిపాడు. ధోనీతోపాటు సీఎస్కే బ్యాటర్లను సుడులు తిరిగే బంతులతో ఇబ్బందులకు గురిచేసేవాడని అన్నాడు.
‘వరుణ్‌ను మిస్ చేసుకోవడం ఇంకా బాధిస్తూనే ఉంది. వేలంలో అతడిని దక్కించుకోలేకపోయాం. తమిళనాడు ఆటగాడైన అతడికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి టాలెంట్ చూసి అబ్బురపడ్డాం. ఈ ఏడాది వేలంలో అతడికి మంచి మొత్తం లభించింది. ఇక అతడు ఈ మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడు’ అని ఫ్లెమింగ్ మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతోనే చెన్నై ఓడిపోయిందని వివరించాడు.
2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో కింగ్స్ XI పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) వరుణ్ చక్రవర్తిని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది. 2019 సీజన్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఒకే మ్యాచ్ ఆడాడు. తన తొలి ఓవర్లోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. 2020 సీజన్‌కు ముందు వరుణ్ చక్రవర్తిని పంజాబ్ జట్టు నుంచి రిలీజ్ చేసింది. 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కేకేఆర్ తరఫునే ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 19 వికెట్లు పడగొట్టాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదు..!
-
Politics News
BJP: ‘మోదీ.. ది బాస్’ అంటే రాహుల్ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్
-
General News
Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు
-
Movies News
Ugram OTT Release: ఓటీటీలోకి నరేశ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
General News
APPSC: త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్
-
Movies News
Aamir Khan: ప్రస్తుతానికి సినిమాలు చేయాలని లేదు.. ఎందుకంటే: ఆమిర్ ఖాన్