Wriddhiman Saha : అతడు టచ్‌లోకి రాలేదు.. క్షమాపణలూ చెప్పలేదు : సాహా

ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన..

Published : 26 Feb 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా వ్యవహారం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ జర్నలిస్ట్‌ తనతో టచ్‌లో లేడని, క్షమాపణలు కూడా చెప్పలేదని సాహా చెప్పాడు. ‘‘ఓ జర్నలిస్ట్‌ సందేశాలతో బాధకు గురయ్యా. నేను ఏ పాత్రికేయుడితోనూ అనుచితంగా ప్రవర్తించలేదు. అలానే వారూ ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆ జర్నలిస్ట్‌ మాత్రం ఇబ్బంది పెట్టాడు. జర్నలిజం ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని ప్రజలకు తెలిసేలా అతడిని బహిర్గతం చేయాలని అడుగుతున్నారు. అయితే ఆ జర్నలిస్ట్‌ నాతో టచ్‌లోకి రాలేదు. నాకు క్షమాపణలూ చెప్పలేదు’’ అని సాహా వివరించాడు. 

ఇదే విషయంపై బీసీసీఐతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సాహా వెల్లడించాడు. ‘‘జర్నలిస్ట్‌ వ్యవహారంపై నేను ట్వీట్‌ చేసిన తర్వాత బీసీసీఐ ఈ-మెయిల్‌ ద్వారా టచ్‌లోకి వచ్చింది. బీసీసీఐ దర్యాప్తు చేస్తోంది. వారికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. ఇప్పటికే నా విధానం ప్రకారం జర్నలిస్ట్‌ గుర్తింపును వెల్లడించలేను. ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఇవ్వాలని భావిస్తా. అందుకే అతడి పేరును బయటకు చెప్పను. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశవాళీతోపాటు ఐపీఎల్‌లో ఆడతా. అయితే శ్రీలంకతో జట్టులోకి తీసుకోకపోవడం షాక్‌కు గురి చేసింది. చివరిసారిగా న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడా. అందుకే లంకతో సిరీస్‌కు ఎంపికవుతానని భావించా. అయితే సెలెక్షన్‌ కమిటీ ఓ నిర్ణయానికొచ్చేసి నన్ను తప్పించింది’’ అని సాహా పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని