కోహ్లీతోపాటు అతడికీ ఆ గౌరవం దక్కాల్సింది.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’పై గంభీర్‌ అసంతృప్తి

శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ ఎంపికపై గౌతం గంభీర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విరాట్‌తో సమానంగా నిలిచిన సిరాజ్‌ను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేయాల్సిందన్నాడు.

Updated : 17 Jan 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌(IND Vs SL)లో కింగ్‌ కోహ్లీ(Virat Kohli) తన బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని చూపించిన విషయం తెలిసిందే. మూడు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు బాది.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల్లో 141.50 సగటుతో 283 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. అయితే కోహ్లీని ఒక్కడినే ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir) అసంతృప్తి వ్యక్తం చేశాడు. వికెట్లతో లంక పతనాన్ని శాంసించిన సిరాజ్‌( Mohammed Siraj)ను కలిపి సంయుక్తంగా ఈ అవార్డును అందించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు.

‘కోహ్లీ ఒక్కడికే ఈ అవార్డును ఇవ్వడం కరెక్ట్‌ కాదేమో. విరాట్‌తో సిరాజ్‌ సమానంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. జాయింట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు ఉండాలి. అతడు ఎంతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. పెద్ద సెంచరీలు చేసే బ్యాటర్లవైపే మనం మొగ్గుచూపుతామని తెలుసు. అయితే ఈ సిరీస్‌ మొత్తంలో సిరాజ్‌ బంతితో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు’ అని గంభీర్‌ అన్నాడు. సిరాజ్‌ ఈ సిరీస్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి టాప్‌వికెట్‌ టేకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక నూతన సంవత్సరంలో తొలి వన్డే సిరీస్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా.. అదే ఉత్సాహాన్ని న్యూజిలాండ్‌పై కొనసాగించాలని చూస్తోంది. కివీస్‌తో తొలి వన్డే బుధవారం హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని