Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
ముంబయి - ఐపీఎల్.. ఈ రెండూ భలే సింక్‌లో ఉంటాయి. అందుకే ఇప్పటివరకు ఐదుసార్లు ఈ ట్రోఫీ ఆ ఫ్రాంచైజీకే దక్కింది. ఈ క్రమంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. (Mumbai Indianas - IPL)
ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్లో ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్ మెషీన్ అని చెప్పొచ్చు. ప్రిమియర్ లీగ్‌లో ఆ జట్టు (Mumbai Indians) ప్రదర్శన అలా ఉంటుంది మరి. అయితే ఇటీవల కాస్త నెమ్మదించింది అనుకోండి. అయితే ఒకసారి కుదరుకుంటే ఈ జట్టును కప్ నుంచి దూరం చేయడం కష్టం అంటుంటారు. 16వ ఐపీఎల్ (IPL 2023) త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముంబయికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు చూద్దాం!
- ఐపీఎల్లో ముంబయి ఇప్పటివరకు 186 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 108 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
- ఐపీఎల్ చరిత్రలో 100 లీగ్ మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు ముంబయి మాత్రమే.
- ప్రత్యర్థిని 146 పరుగుల తేడాతో ఓడించిన ఘనత ముంబయిది. దిల్లీపై ముంబయి 2017లో ఈ ఫీట్ నమోదు చేసింది.
- ముంబయి ఇప్పటివరకు ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ముంబయి టోర్నీ విన్నర్‌గా నిలిచింది.
- ఐపీఎల్లో ముంబయి బౌలర్ల దూకుడు మామూలుగా ఉండదు. అన్ని టీమ్‌ల కంటే మేటిగా 40 మెయిడిన్ ఓవర్లు వేశారు మరి.
- కొడితే ఫోర్, లేదంటే సిక్స్.. ఇదీ ముంబయి పల్టాన్ బ్యాటింగ్. ఇప్పటివరకు టోర్నీలో 1308 సిక్స్‌లు బాదగా, 2980 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.
- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఛేజింగ్ కూడా ముంబయిదే. 87 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా మీద 2008లో గెలుపొందింది.
- ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో గత పదేళ్లుగా ముంబయిని ఓడించిన జట్టే లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది ముంబయి.
- వందకు పైగా వికెట్లు పడగొట్టిన ముగ్గురు బౌలర్లు ముంబయి జట్టులో ఉన్నారు. లసిత్ మలింగ (122 వికెట్లు), హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (120) ఆ ఘనత సాధించారు.
- ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా ముంబయి బౌలర్‌దే. అల్జారీ జోసెఫ్ 2019లో హైదరాబాద్ మీద 6/12తో అద్భుత ప్రదర్శన చేశాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్