IND vs SA : వాండరర్స్‌ మైదానంలో వికెట్‌.. కుంబ్లే తర్వాత అశ్వినే.!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌..

Published : 07 Jan 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా మాజీ స్పిన్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌ మైదానంలో వికెట్‌ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. 

2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. వాండరర్స్‌లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే (2/2, 3/54) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా ఆ టెస్టులో 123 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. అప్పటి నుంచి టీమ్‌ఇండియా రెండు సార్లు (2013-14, 2017-18) దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. తాజా పర్యటనలో భాగంగా వాండరర్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌లో వికెట్ తీసిన భారత స్పిన్నర్‌గా అశ్విన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు.

ఇదిలా ఉండగా, వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా రద్దయ్యింది. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా 118/2 స్కోరుతో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (46), వాండర్‌ డస్సెన్‌ (11) క్రీజులో కొనసాగుతున్నారు. మరో వైపు, భారత్ ఈ టెస్టులో విజయం సాధించి సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించాలని చూస్తోంది.!

Read latest Sports News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని