అతడి బౌలింగ్‌ వీడియో గేమ్‌లా ఉంటుంది.. : బుమ్రాను కొనియాడిన అర్ష్‌దీప్‌

ఈ పొట్టి ప్రపంచకప్‌లో బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published : 27 Jun 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup 2024)లో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా(IND vs ENG) సెమీస్‌ పోరులో తలపడనుంది. ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు తనదైన వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రాను మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కొనియాడాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం బౌలింగ్‌ వ్యూహాలపై అర్ష్‌దీప్‌, కుల్‌దీప్‌ల మధ్య జరిగిన సంభాషణల వీడియోను టీమ్‌ఇండియా పంచుకుంది. మైదానంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ ఎలా చేశావని కుల్‌దీప్‌ను ప్రశ్నించగా..‘అది ఎంతో కష్టంగా అనిపించింది. బ్యాటర్లను రీడ్‌ చేసి బంతి వేయాల్సి వచ్చింది. రైట్‌హ్యాండ్‌ బ్యాటర్లు లెఫ్ట్‌ వైపు టార్గెట్‌ చేశారు. దీంతో ఫుల్లర్‌ బంతిని వేసేందుకు ప్రయత్నించా. వారు స్వీప్‌ చేసేందుకు ప్రయత్నిస్తే వికెట్‌ దొరికే చాన్స్‌ ఉంటుంది’ అని పేర్కొన్నాడు.

ఇక బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకోవడంపై అర్ష్‌దీప్‌ స్పందించాడు. ‘బుమ్రాతో కలిసి బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ కష్టం కాదు. అతడు వీడియో గేమ్‌లా బౌలింగ్‌ చేస్తాడు. కేవలం రెండు, మూడు పరుగులే ఇస్తాడు. దీంతో బ్యాటర్లు ఒత్తిడిలోకి వెళ్తారు. ఆ తర్వాత రిస్కీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇలా నాకు చాలా వికెట్లు వచ్చాయి. ఆ క్రెడిట్‌ అతడికే దక్కుతుంది. బౌలర్ల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ఒక ఎండ్‌ నుంచి పరుగులను ఆపితే.. మరో ఎండ్‌ నుంచి వికెట్లు తీస్తున్నారు. బౌలర్లలో అందరూ బాగా రాణిస్తున్నారు’’ అని అర్ష్‌దీప్‌ వివరించాడు.

ప్రస్తుత టోర్నీలో అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకూ 15 వికెట్లు తీసి.. టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు బుమ్రా 11 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని