
T20 League : భీకర ఫామ్‌లో బట్లర్.. కోహ్లీ రికార్డును తుడిచేస్తాడా..?
ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. అయితే అన్ని వేళలా వర్తించదు. బౌలర్లూ కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ మంచి ప్రదర్శన చేస్తూ ఉంటారు. వారిని ఎదుర్కొని 120 బంతులు మాత్రమే ఉండే మ్యాచులో అర్ధశతకం సాధిస్తే గొప్ప.. అలాంటిది సెంచరీ కొడితే అబ్బో అనాల్సిందే.. ఇక ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేస్తే వారిని సూపర్ బ్యాటర్లుగానే పరిగణించాలి. ఇలాంటి ఫీట్‌ను ఈ సీజన్ టీ20 లీగ్‌లో బట్లర్ సాధించాడు. ఈ జాబితాలో ఇంకెవరెవరు సాధించారు.. టాప్‌లో ఏ బ్యాటర్ ఉన్నాడనే విషయాలను తెలుసుకుందాం..
ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు
విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్న రోజులవి.. ఏ ఫార్మాటైనా సరే ‘రన్ మెషిన్’ పరుగులు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో భీకరమైన బౌలర్ ఉన్నా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు బెంగళూరు ఒక్క టీ20 లీగ్ కప్‌ను సొంతం చేసుకోకపోయినా వ్యక్తిగతంగా కోహ్లీ గొప్ప రాణించాడు. ఇప్పటికీ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు కోహ్లీపై ఉందంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. 2016 సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 152.03 స్ట్రైక్‌రేట్‌తో నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలతో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. ఇక బ్యాటింగ్ సగటు చూస్తే 81.08. ఆ సీజన్‌లో విరాట్ అత్యధిక స్కోరు 113 పరుగులు.
ఈసారి బట్లర్ జోరు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగిపోతున్నాడు. బంతిని బౌండరీకి తరలించడమే ఏకైక లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో బట్లర్ (375) టాప్‌లో ఉన్నాడు. అదే విధంగా సీజన్‌లో రెండు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ కూడా బట్లరే. ముంబయిపై 100 (68 బంతుల్లో), కోల్‌కతాపై 103 (61 బంతుల్లో) పరుగులు బాదాడు. రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. అంతేకాకుండా గత 23 టీ20 ఇన్నింగ్స్‌లను పరిగణనలోకి తీసుకుంటే బట్లర్ నాలుగు సెంచరీలు చేయడం విశేషం. ఒకే సీజన్‌లో రెండు శతకాలు నమోదు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలోకి బట్లర్ చేరాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఇప్పటికి ఆరు మ్యాచులను మాత్రమే ఆడింది. ఇంకా లీగ్ దశలోనే ఎనిమిది మ్యాచ్‌లు ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు చేరితే కనీసం ఇంకో మ్యాచ్ ఆడొచ్చు. మరి మిగతా మ్యాచుల్లోనూ మూడు శతకాలు చేస్తే కోహ్లీని దాటేసే అరుదైన అవకాశం బట్లర్‌కు ఉంది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలోనూ బట్లర్‌దే మొదటి స్థానం. ఇప్పటి వరకు 23 సిక్సర్లను బాదేశాడు.
గత సీజన్‌లో జోస్ ఎలా ఆడాడంటే..?
కరోనా కారణంగా రెండు దశల్లో జరిగిన గత సీజన్ టీ20 లీగ్‌లో రాజస్థాన్‌కే ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో దశలో పాల్గొనలేదు. భారత్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో మాత్రం ఏడు మ్యాచుల్లో 254 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం (124) ఉంది. స్ట్రైక్‌రేట్ (153.01) బాగున్నా బ్యాటింగ్ సగటు 36.28 మాత్రమే ఉంది. అయితే ప్రస్తుత సీజన్‌లో భారీ సగటు (75)తో పరుగులు చేస్తున్నాడు. ఇదే విధంగా ఆడితే కోహ్లీ అత్యధిక పరుగులు (973) రికార్డుకు చేరువగా వచ్చే అవకాశం ఉంది.
వీరు కూడా రెండేసి..
క్రిస్ గేల్, హషీమ్ ఆమ్లా, షేన్ వాట్సన్, శిఖర్ ధావన్ కూడా ఒకే సీజన్‌లో రెండు శతకాలను నమోదు చేశారు. 2011 సీజన్‌లో బెంగళూరు తరఫున క్రిస్ గేల్ (608) 12 మ్యాచుల్లో రెండు సెంచరీలను నమోదు చేశాడు. ఒకే సీజన్‌లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన మొదటి బ్యాటర్‌గా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును కోహ్లీ (2016) నాలుగు శతకాలతో బద్దలు కొట్టాడు. ఇక 2017 సీజన్‌లో కోల్‌కతా బ్యాటర్ హషీమ్ ఆమ్లా (2), 2018లో చెన్నై తరఫున ఆడిన షేన్ వాట్సన్ (2), 2020లో దిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్ (2) మాత్రమే ఒకే సీజన్‌లో రెండు శతకాలు సాధించారు. ఆ తర్వాత ఇప్పుడు జోస్ బట్లర్.
బట్లర్ కాకుండా ఇంకెవరి ఛాన్స్ ఉందంటే..?
ప్రస్తుతం సీజన్‌లో రెండు శతకాలు చేసిన జోస్ బట్లర్‌కు కాకుండా గుజరాత్ సారథి కేఎల్ రాహుల్‌కూ అత్యధిక సెంచరీలు సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక శతకం చేసిన కేఎల్ రాహుల్ (235) టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే బట్లర్‌కు పోటీ ఇవ్వగలడు. లఖ్‌నవూ కూడా ఇప్పటి వరకు ఆరు మ్యాచులను మాత్రమే ఆడింది. ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో శతకాలు సాధించడం రాహుల్‌కు కష్టమేమీ కాదు. వీరిద్దరూ ఓపెనర్లు కావడం కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వస్తుండటం వల్ల సెంచరీలు నమోదు చేసే అవకాశం దొరకడం లేదు. మంచి ఇన్నింగ్స్‌లను మాత్ర ఆడగలుగుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు