Tokyo Olympics: హాకీ జట్టు పతకం గెలిచే దమ్ముంది

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు పతకం తీసుకొస్తాయని దిగ్గజ క్రీడాకారుడు ధన్‌రాజ్‌ పిళ్లై ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ఫిట్‌నెస్‌తో ఉండటమే పురుషుల జట్టు బలమని పేర్కొన్నారు. ఐదేళ్లుగా రెండు జట్లూ రాణిస్తున్నాయని ప్రశంసించారు. ...

Updated : 25 Oct 2022 12:18 IST

దిగ్గజ క్రీడాకారులు ధన్‌రాజ్‌ పిళ్లై

ముంబయి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు పతకం తీసుకొస్తాయని దిగ్గజ క్రీడాకారుడు ధన్‌రాజ్‌ పిళ్లై ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ఫిట్‌నెస్‌తో ఉండటమే పురుషుల జట్టు బలమని పేర్కొన్నారు. ఐదేళ్లుగా రెండు జట్లూ రాణిస్తున్నాయని ప్రశంసించారు. బెంగళూరులో క్రీడాకారులను కలుసుకోవాలని భావించినా కరోనా ఆంక్షలతో కుదర్లేదని వెల్లడించారు.

‘ఐదేళ్లుగా హాకీ జట్లు బాగా ఆడుతున్నాయి. దేహదారుఢ్యమే వారి బలం. మా రోజుల్లో ఇలాంటి అండదండలు లేవు. ఇప్పటికే పురుషుల జట్టు అద్భుతాలు చేసింది. 2016, 2018 ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ లీగ్‌ ఫైనల్స్‌ (2015, 2017) ఫలితాల్లో ఆకట్టుకుంది. ఈ ఒలింపిక్స్‌లో వారు తప్పక రాణిస్తారు’ అని ధన్‌రాజ్‌ అన్నారు. రెండు జట్ల సారథులు మన్‌ప్రీత్‌, రాణి రాంపాల్‌కు ఆయన లేఖలు రాశారు.

‘నేనూ బెంగళూరులోనే ఉండటంతో క్రీడాకారులను కలుద్దామని భావించా. కరోనా నిబంధనల వల్ల నేరుగా కలవలేకపోయా. అందుకే ప్రత్యేకంగా లేఖలు రాశా. ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించా. క్రీడా జీవితంలోనే అద్భుతమైన ఈ సందర్భాన్ని ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని కోరాను’ అని పిళ్లై తెలిపారు. ‘పతకం దృష్టిలో పెట్టుకొని ఆడొద్దని రెండు జట్లకు సూచిస్తున్నా. ఒక్కో మ్యాచు ఆడుతూ ముందుకెళ్లాలి. ఆఖరి రోజు వరకు ఒక బృందంగా ముందుకు సాగాలి’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని