Ravi Shastri: ఇప్పుడు చెప్పండి... 3 రోజుల పిచ్ గొప్పదా? ఐదు రోజుల పిచ్ గొప్పదా? : రవి శాస్త్రి
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు రోజుల పాటు సాగిన నాలుగో టెస్టు ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు మూడు రోజుల్లోపే ముగిసిన మూడు టెస్టుల్లో ఫలితం లభించింది. దీంతో ఈ పిచ్‌లపై రవిశాస్త్రి(Ravi Shastri) చర్చ లేవనెత్తాడు.
ఇంటర్నెట్ డెస్క్ : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ముగిసింది. సిరీస్ విజేతగా భారత్(Team India) నిలిచింది. అయితే.. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య(IND vs AUS) ఆట కంటే.. పిచ్‌లపైనే చర్చ ఎక్కువగా సాగింది. తొలి మూడు టెస్టులు మూడు రోజుల్లోపే ముగియగా.. బ్యాటర్లకు అనుకూలించిన అహ్మదాబాద్ టెస్టు ఐదు రోజులూ సాగింది. అయితే ఎలాంటి ఫలితాన్నివ్వలేదు. ఈ పిచ్‌లపై మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మరోసారి స్పందించాడు.
మూడు రోజుల్లోగా ముగిసి.. ఫలితాన్నిచ్చిన పిచ్‌లు గొప్పవా..? లేదా ఐదు రోజులూ జరిగి ఎలాంటి ఫలితం ఇవ్వని పిచ్ గొప్పదా? అంటూ రవిశాస్త్రి కామెంట్రీ బ్యాక్స్‌లోంచి ప్రశ్నించి ఈ అంశంపై మరోసారి చర్చను లేవనెత్తారు. ‘మూడు రోజుల్లోగా ముగిసిన తొలి మూడు మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు పడ్డాయి.. ఐదు రోజులు జరిగిన నాలుగో టెస్టులో ఆ మ్యాచ్‌లతో పోల్చితే చాలా తక్కువ వికెట్లు పడ్డాయి. దీనిపైనే చర్చ జరగాలి. మీకు ఇలాంటి పిచ్ కావాలా.. ? లేక వేరే పిచ్‌లా..?భారత పిచ్‌లపై ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు సంతోషంగా ఉంటారనుకుంటా’ అంటూ శాస్త్రి పేర్కొన్నాడు.
తొలి రెండు టెస్టులు జరిగిన పిచ్‌లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇవ్వగా.. మూడో టెస్టు జరిగిన పిచ్‌కు పేలవమని రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాలుగో టెస్టు జరిగిన అహ్మదాబాద్ పిచ్‌కు ఎలాంటి రేటింగ్ ఇవ్వనుందో వేచి చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Wrestlers: అలాగైతేనే ఏషియన్ గేమ్స్‌కు వెళ్తాం.. రెజ్లర్ల అల్టిమేటం
-
Crime News
Apsara Murder Case: ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్లో శోధించి పథకం ప్రకారమే హత్య
-
Sports News
WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్‌పై గావస్కర్ అసహనం..
-
Movies News
Ileana: ఆశను కోల్పోయిన వేళ.. నా కన్నీళ్లు తుడిచాడు: ప్రియుడి గురించి ఇలియానా తొలి పోస్ట్
-
Politics News
Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
-
Crime News
Gold seized: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత