Virat Kohli : వందో టెస్టులో కోహ్లీ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాలి : సునీల్ గావస్కర్‌

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ త్వరలో ఆడనున్న వందో టెస్టులో సెంచరీ బాదాలని కోరుకుంటున్నానని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది వందకి పైగా..

Updated : 03 Mar 2022 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ త్వరలో ఆడనున్న వందో టెస్టులో సెంచరీ బాదాలని కోరుకుంటున్నానని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది వందకి పైగా టెస్టు మ్యాచులు ఆడారని.. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే వందో టెస్టులో శతకం నమోదు చేశారని పేర్కొన్నాడు. పంజాబ్‌లోని మొహాలీ వేదికగా.. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు మ్యాచే కోహ్లీ ఆడనున్న వందో టెస్టు కావడం గమనార్హం.

‘ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు వందకి పైగా టెస్టు మ్యాచులు ఆడారు. కానీ, వారిలో చాలా కొద్ది మంది మాత్రమే వందో టెస్టులో సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించారు. భారత్‌ తరఫున ఒక్కరు కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. అందుకే, వందో టెస్టు ఆడనున్న విరాట్‌ కోహ్లీ శతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. అతడు ఒక్క టెస్టు క్రికెట్లోనే కాదు.. మిగతా ఫార్మాట్లలో కూడా ఎన్నో గొప్ప ఘనతలు సాధించాడు. దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు’ అని సునీల్ గావస్కర్‌ చెప్పాడు.

భారత్‌ తరఫున ఇప్పటి వరకు కేవలం 10 మంది ఆటగాళ్లు మాత్రమే వందకు పైగా టెస్టు మ్యాచులు ఆడారు. సచిన్‌ తెందూల్కర్‌ (200), రాహుల్ ద్రవిడ్‌ (163), వీవీఎస్ లక్ష్మణ్‌ (134), అనిల్‌ కుంబ్లే (132), కపిల్‌ దేవ్‌ (131), సునీల్‌ గావస్కర్‌ (125), దిలిప్‌ వెంగ్‌సర్కార్‌ (116), సౌరవ్‌ గంగూలీ (113), ఇశాంత్‌ శర్మ (105), హర్భజన్‌ సింగ్‌ (103), వీరేంద్ర సెహ్వాగ్‌ (103) టెస్టు  మ్యాచులు ఆడారు. శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ ఆడటం ద్వారా వంద టెస్టులు ఆడిన 12వ ఆటగాడిగా నిలువనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని