pele: బ్రెజిల్ ‘జాతీయ సంపద’గా పీలే..!
బ్రెజిల్‌లో అత్యంత అరుదైన గౌరవం పీలే(pele)కు దక్కింది. ఆయన్ను ఐరోపా ఫుట్‌బాల్ క్లబ్‌ల నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి పీలేను జాతీయ సంపదగా ప్రకటించడం విశేషం.
పీలే(pele) జీవితంలో ప్రతి అడుగు దేవుడు ఎంతో ఆలోచించి నిర్దేశించినట్లు మంత్రముగ్ధంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణ అమెరికాలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. ఐరోపాలోని లీగ్ జట్లలో ఆడి వేల కోట్లు సంపాదిస్తున్నారు. అర్జెంటీనా స్టార్ మెస్సీ, బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ ఐరోపాలోని పీఎస్‌జీ తరఫున లీగ్‌ల బరిలోకి దిగుతున్నారు. 1960ల్లో కూడా దక్షిణ అమెరికా ఆటగాళ్లను భారీ మొత్తాలకు ఐరోపా లీగ్‌లు కొనేసేవి. కానీ, పీలేను కొనడం మాత్రం వాటి వల్లకాలేదు. దీనికో కథ ఉంది..
సాధారణంగా ఏ దేశంలోనైనా అరుదైన వాటిని జాతీయ సంపదగా ప్రకటిస్తారు. కానీ, బ్రెజిల్‌లో ఓ ఆటగాడిని జాతీయ సంపదగా ప్రకటించారు. ఆ అరుదైన ఘనతను పీలే(pele) 1961లో అందుకొన్నారు. వాస్తవానికి 1958 ప్రపంచకప్ టోర్నీలో పీలే ఆటను చూసిన ఫుట్‌బాల్ క్లబ్ యజమానులు వెర్రెక్కిపోయారు. పీలే అప్పటికే బ్రెజిల్‌లోని శాంటోస్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అతడిని ఎలాగైనా తమ జట్టులోకి తీసుకోవాలని ఐరోపాలోని సంపన్న ఫుట్‌బాల్ క్లబ్‌లు విశ్వ ప్రయత్నాలు చేశాయి. 1958లో పీలేతో కాంట్రాక్టుపై సంతకం చేయించడంలో ఇంటర్ మిలన్ క్లబ్ విజయం సాధించింది. కానీ, బ్రెజిల్ ఫ్యాన్స్ దీనిపై మండిపడ్డారు. ప్రజాగ్రహాన్ని గ్రహించిన శాంటోస్ ఛైర్మన్ ఇంటర్ మిలన్ యజమాని ఆంగెలో మోరట్టీతో మాట్లాడి ఆ ఒప్పందాన్ని రద్దు చేయించాడు. స్పెయిన్‌కు చెందిన వాలెన్సియా జట్టు కూడా పీలేతో కాంట్రాక్టు కోసం చివరి వరకు యత్నించింది. కానీ, శాంటోస్ క్లబ్ యాజమాన్యం జనాగ్రహానికి భయపడి విక్రయించడానికి అంగీకరించలేదు. ఇక తాము ఏదో ఒకటి చేయకపోతే ఐరోపా ఫుట్‌బాల్ క్లబ్‌లు పీలేను ఎగరేసుకుపోతాయని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన చెందింది. 1961లో నాటి బ్రెజిల్ అధ్యక్షుడు జానియో క్వాడ్రోస్ రంగంలోకి దిగి పీలేను అధికారికంగా ‘జాతీయ సంపద’గా ప్రకటించారు. దీంతో దేశం బయట లీగ్ జట్లకు అతడిని బదలాయించడానికి అవకాశం లేకుండాపోయింది.
నేలను తాకిన బంతిలా..
పీలే (pele) 1962 ప్రపంచకప్ విజేత. కానీ, దానిలో అతడి పాత్ర చాలా పరిమితం. ఈ టోర్నీలో హైరేటెడ్ ఆటగాడిగా అడుగుపెట్టిన అతడు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. మిగిలిన సమయం మొత్తం గాయంతో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆ రెండు మ్యాచుల్లోనే ఒక గోల్ చేసి.. మరో గోల్‌కు అసిస్ట్ చేశాడు. మిగిలిన టోర్నీలో శాంటోస్ జట్టు సహచరుడు గారించా చెలరేగిపోవడంతో బ్రెజిల్ ఆ ప్రపంచకప్ గెలిచింది. కానీ, 1966 ప్రపంచకప్‌లో పీలే ఆటతీరుతో అభిమానులు నిరాశచెందారు. ప్రత్యర్థి జట్లు కూడా పూర్తిగా పీలేనే లక్ష్యంగా చేసుకొన్నాయి. ముఖ్యంగా పోర్చుగల్, బల్గేరియాలతో జరిగిన మ్యాచ్‌ల్లో పీలే విఫలం అయ్యాడు. గాయాలు కూడా పీలే ఆటతీరును దెబ్బతీశాయి. దీంతో బ్రెజిల్ తొలిరౌండ్ దాటలేదు. ఆ తర్వాత నుంచి అతడి ఆటస్థాయి కూడా తగ్గుతూ వచ్చింది. 1970 ప్రపంచకప్ జట్టుకు ఎంపికచేయగా.. ఆడేందుకు నిరాకరించాడు. అప్పటికే పీలే కమ్యూనిస్టు సానుభూతి పరుడన్న అనుమానంతో సైనిక ప్రభుత్వం అతడిపై దర్యాప్తు చేపట్టింది. అతడి సహచరులు చాలా మంది అప్పటికే రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత అంగీకరించి జట్టులో చేరాడు. ఆరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్ చేశాడు. ఈ టోర్నిలో పీలే నాలుగు గోల్స్ సాధించాడు. కీలకమైన ఫైనల్స్‌లో తొలి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. మూడో ప్రపంచకప్ అందుకొన్న మరుసటి ఏడాదే యుగోస్లావియాతో చివరి మ్యాచ్ ఆడాడు. 1974లో క్లబ్ ఫుట్‌బాల్ నుంచి కూడా వైదొలగాడు. పీలే కెరీర్ మొత్తంలో 92 హ్యాట్రిక్‌లు నమెదు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. పీలే సాధించిన రికార్డులు, గౌరవాలు, అవార్డులు కోకొల్లలు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: అమర్తలూరు పోలీస్ స్టేషన్లో వైకాపా కార్యకర్తల వీరంగం
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్