Published : 12 Mar 2022 01:25 IST

Sachin Tendulkar : ఆ ఒక్క వీడియోనే.. సచిన్‌ని కలిసేలా చేసింది.!

ఇంటర్నెట్ డెస్క్‌: ఓ చిన్నారి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో రాత్రికి రాత్రే ‘ఇంటర్నెట్ సెన్సేషన్‌’గా మారాడు. దాంతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ దృష్టినీ ఆకర్షించాడు. ఏకంగా సచిన్‌ ఏర్పాటు చేసిన ‘మిడిల్‌సెక్స్‌ గ్లోబల్ అకాడమీ’లో ఐదు రోజుల పాటు ట్రెయినింగ్‌ పొందే అరుదైన అవకాశం కూడా దక్కించుకున్నాడు. అతడే కోల్‌కతాకు చెందిన ఎస్కే షహీద్‌. షహీద్ తండ్రి షేక్‌ షంషీర్‌ కోల్‌కతాలోని ఓ హెయిర్‌ సెలూన్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

‘షహీద్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను నేను నా ట్విటర్‌ ఖాతాలో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ఛానల్‌ ‘ఫాక్స్‌ క్రికెట్‌’.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ని, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్ వాన్‌ని, ఇటీవల మృతి చెందిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ని ట్యాగ్‌ చేస్తూ రీట్వీట్ చేసింది. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన సచిన్.. మేం కోల్‌కతా నుంచి ముంబయికి వచ్చేందుకు తన సొంత ఖర్చులతో అన్ని ఏర్పాట్లు చేశారు. అతడి గెస్టు హౌజ్‌లో మాకు వసతి కల్పించారు. సచిన్‌ సారే మమ్మల్ని దగ్గరుండి క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లారు. అక్కడ ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. దాంతో పాటు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేందుకు అనువుగా షెడ్యూల్ కూడా తయారు చేసిచ్చారు. ఏ బంతిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పలు సూచనలు చేశారు. ఆ తర్వాత క్యాచులు ఎలా పట్టాలి? బ్యాట్‌ను ఏ విధంగా పట్టుకోవాలనే విషయాలపై కొన్ని సలహాలు ఇచ్చారు. మా అబ్బాయిలో  గొప్ప టాలెంట్‌ ఉందని.. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని సచిన్‌ సంతోషం వ్యక్తం చేశారు’అని షంషీర్‌ పేర్కొన్నాడు. 
     
‘నా కొడుకు షహీద్‌కి సచిన్‌ తెందూల్కర్‌ అంటే ఎనలేని అభిమానం. అతడిలా గొప్ప క్రికెటర్‌ కావాలనుకునేవాడు. ఒక్క సారైనా సచిన్‌ని చూడాలని కలలు కనేవాడు. కానీ, ఏకంగా సచిన్ ముందే ఆడే అవకాశం రావడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంత గొప్ప అవకాశం కల్పించిన సచిన్‌ సర్‌కి ఎలా ధన్యవాదాలు తెల్పాలో తెలియడం లేదు’ అని షేక్‌ షంషీర్‌ చెప్పాడు. సాక్షాత్తూ సచిన్‌ లాంటి గొప్ప క్రికెటరే షహీద్‌లోని టాలెంట్‌ చూసి ముచ్చట పడటంతో.. మంచి క్రికెట్ క్లబ్‌లో చేర్పించి.. ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడమే తరువాయి అని షేక్‌ షంషీర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని