Team India: 2011లో వన్డే ప్రపంచకప్‌.. ధోనీ, సచిన్‌ పారితోషికం ఎంతంటే?

2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటి కెప్టెన్‌ ధోనీ, సచిన్‌ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా!

Updated : 09 Jul 2024 12:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోహిత్‌ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2024ను సొంతం చేసుకున్న భారత్‌ జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా (BCCI Cash Prize) అందించింది. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5కోట్లు, కోచ్‌లకు రూ.2.5 కోట్లు, రిజర్వుడు ఆటగాళ్లకు, సెలక్టర్లకు రూ.కోటి చోప్పున అందివ్వనున్నారు. అయితే.. 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటి కెప్టెన్‌ ధోనీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా! 2011లో భారత జట్టు వన్డే ప్రపంపకప్‌ గెలిచినప్పుడు ధోని, సచిన్‌ ఇతర ఆటగాళ్లు ఒక్కొక్కరు రూ.2కోట్లు అందుకున్నారు. కోచ్ సిబ్బందికి రూ.50 లక్షలు, సెలక్టర్లకు రూ.25 లక్షలు ఇచ్చారు. 2024 టీ20 ప్రపంపకప్‌ (ICC Mens T20 World Cup) గెలిచిన జట్టులోని ఏకైక ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్టులో కూడా ఉన్నాడు. 2007లో ధోనీ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్‌ను సాధించిన జట్టుకు బీసీసీఐ రూ.12 కోట్లు రివార్డు ప్రకటించింది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని సాధించిన భారతజట్టులోని క్రీడాకారులకు బీసీసీఐ (BCCI) రూ.కోటి చొప్పున నజరానా అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని