WTC Final: ఒకవేళ నాలుగో టెస్టు డ్రా... మరి ‘డబ్ల్యూటీసీ’ ఫైనల్‌కు వెళ్తామా?
టెస్టు సిరీస్ విజయం కంటే భారత్‌కు (Team India) ముందున్న లక్ష్యం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడం.. ఆసీస్‌తో నాలుగో టెస్టులో (IND vs AUS) భారత్ సాధించే ఫలితంపై మన అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా ఒకటే చర్చ.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలుస్తుందా.? లేదా..? ఎందుకంటే ఇక్కడ సిరీస్ విజయం కంటే అతి ముఖ్యమైన మరొక ఈవెంట్‌కు వెళ్లేందుకు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఫలితం కీలకంగా మారింది.ఆ ఈవెంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్టు జరుగుతోంది. ఈ క్రమంలో సిరీస్ ఎలాగూ భారత్ నుంచి చేజారే అవకాశం లేదు. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ మనదే అవుతుంది. కానీ, వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)కు చేరుకోవాలంటే మాత్రం భారత్‌కు విజయం అవసరం. గెలిస్తే.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌తోనే తలపడేందుకు సిద్ధమైపోవచ్చు. కానీ, ఒకవేళ ఓడినా, మ్యాచ్ డ్రా అయినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న గందరగోళానికి తెరపడాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్ - ఆసీస్ నాలుగో టెస్టుతోపాటు న్యూజిలాండ్ - శ్రీలంక తొలి టెస్టు చివరి రోజు వరకు వెళ్లింది.
WTC ఫైనల్ సమీకరణాలు ఇలా..
• నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ విజయం సాధిస్తే.. టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడంతోపాటు WTC ఫైనల్‌కు టీమ్‌ఇండియా నేరుగా చేరుతుంది. అప్పుడు న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్ విజయం సాధించినా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
• ఒకవేళ నాలుగో టెస్టులో ఓడినా భారత్‌కు ఫైనల్ అవకాశం ఉంటుంది. కానీ, న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఒక్క టెస్టు ఓడినా చాలు. అలాగే సిరీస్ డ్రా అయినా భారత్‌కు తిరుగుండదు. రెండు టెస్టులూ డ్రా అయినా మనకేం సమస్య లేదు.
• భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతున్న తీరును చూస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం కష్టమే. కానీ, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అంటే సిరీస్ 2-1తో ముగుస్తుంది. అప్పుడు లంక కచ్చితంగా ఓ టెస్టులో ఓడిపోవాలి. తొలి టెస్టులోనే కివీస్ గెలిచేస్తే రెండో టెస్టు ఫలితంపై మన WTC బెర్తు ఆధారపడి ఉండదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!
-
Movies News
Vishwak Sen: కాంట్రవర్సీకి కారణమదే.. సృష్టించాల్సిన అవసరం నాకు లేదు: విశ్వక్సేన్
-
World News
Ukraine: రష్యాలో జిన్‌పింగ్.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
-
India News
Earthquake: దిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
-
Sports News
UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన