పొలార్డ్‌ 6 సిక్సర్లపై యువీ స్పందన ఇదే

వెస్టిండీస్‌ పొడగరి కీరన్‌ పొలార్డ్‌ ఆరు సిక్సర్లపై టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి అతడికి స్వాగతం చెప్పాడు. ‘ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్‌ పొలార్డ్‌. అద్భుతంగా ఆడావ్‌!!!’ అని ట్వీట్‌ చేశాడు....

Published : 04 Mar 2021 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌ పొడగరి కీరన్‌ పొలార్డ్‌ ఆరు సిక్సర్లపై టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి అతడికి స్వాగతం చెప్పాడు. ‘ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్‌ పొలార్డ్‌. అద్భుతంగా ఆడావ్‌!!!’ అని ట్వీట్‌ చేశాడు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షలె గిబ్స్‌ అందరికన్నా ముందుగా ఈ ఘనత సాధించాడు. 2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచులో 6 సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో యువీ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచులో స్టువర్ట్‌ బ్రాడ్‌ విసిరిన ఓవర్లో ఆరుకు ఆరు సిక్సర్లు బాది తన పేరును మార్మోగించాడు. ఆ తర్వాత మరికొందరు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యమవ్వలేదు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా గతేడాది ఐపీఎల్‌లో ఈ రికార్డు అందుకొనేలా కనిపించాడు. అయితే అతడు ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లే బాదడం గమనార్హం.

మళ్లీ ఇన్నాళ్లకు పొలార్డ్‌ 6 బంతుల్లో 6 సిక్సర్లు సాధించాడు. శ్రీలంకతో జరిగిన టీ20 పోరులో అఖిల ధనంజయ వేసిన ఓవర్లో దంచికొట్టాడు. ఈ ఘనత సాధించిన వెంటనే వెస్టిండీస్‌ వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ ‘యువరాజ్‌, హర్షలె గిబ్స్‌ ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి మరొకరు ప్రవేశించారు’ అంటూ ఉత్సాహంగా చెప్పడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని